వాళ్లిద్దరూ ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు. ఏడాది కాలంగా సాగుతున్న వీరి ప్రేమాయణంతో ఇద్దరు కలిసి సినిమాలు, షికారులు అంటూ తెగ తిరిగారు. ఇక కులాలు వేరైనా తల్లిదండ్రులను ఒప్పించి మరీ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అంతా బాగానే ఉందనుకున్న తరుణంలోనే వీరి లవ్ స్టోరీ ఊహించని ములుపుకు తిరిగింది. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారుతోంది. అసలు వీరి లవ్ స్టోరీ ఏం జరిగింది? చివరికి పెళ్లి చేసుకున్నారా లేదా అనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అది ఉత్తర్ ప్రదేశ్ ఫతేపూర్ జిల్లా ఝజీపూర్ పరిధిలోని శేషహాన్. ఇదే గ్రామంలో బిరుదుబే (22), మీనాదేవి (18) యువతి, యువకుడు నివాసం ఉంటున్నారు. ఒకే ఊరు కావడంతో ఇద్దరికి కాస్త పరిచయం ఏర్పడింది. ఈ పరిచయంతోనే ఇద్దరు కొన్నాళ్ల పాటు మాట్లాడుకున్నారు. అలా వీరి పరిచయం చివరికి ప్రేమ వరకు వెళ్లింది. దీంతో ఒకరికి ఒకరు నచ్చుకోవడంతో ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు. అలా వీరి ప్రేమాయణం నెలల నుంచి ఏడాది వరకు గడిచింది. ఈ సమయంలోనే ఈ ప్రేమికులు సినిమాలు, షికారులు అంటూ తెగ తెరిగారు. ఇక కులాలు వేరైనా సరే పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే ఈ క్రమంలోనే యువతి ప్రేమ వ్యవహారం వారి తల్లిదండ్రులకు తెలిసింది.
దీంతో కుటుంబ సభ్యులు మీనాదేవిని మందలించారు. తీవ్ర మనస్థాపానికి లోనైన మీనాదేవి.. ఇదే విషయాన్ని తన ప్రియుడికి తెలియజేసింది. ఇక మన పెళ్లికి ఒప్పుకోరని అనుకున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల ఓ రోజు రాత్రి ఇద్దరూ ఇంటి నుంచి వెళ్లి ఓ పొలంలో కలుసుకున్నారు. బతికుండగా మనం కలిసి ఉండలేమని, మనల్నీ పెద్దలు విడిదిస్తారని అనుకున్నారు. ఇక బతకడం కన్నా, చనిపోవడం మేలు అనుకుని ఇద్దరూ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. తెల్లారేసరికి ఈ విషయం ఊరంతా తెలిసిపోయింది. దీంతో ఇరువురి తల్లిదండ్రుల కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ విషాద ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.