భార్యాభర్తల మధ్య గొడవలు జరగడం సహజం. కానీ ఇలాంటి చిన్న చిన్న గొడవలకే కొందరు హత్యలు, ఆత్మహత్యల వరకూ వెళ్తున్నారు. భర్త కొత్త చీర కొనివ్వలేదని, భార్య చెప్పిన మాట వినలేదని ఇలా పలు రకాల కారణాలతో విడిపోవడం, లేదంటే ఆత్యలు చేయడం వంటివి చేస్తున్నారు. అచ్చం ఇలాంటి ఘటనలోనే క్షణికావేశంలో ఓ భర్త తండ్రితో చేతులు కలిపి భార్యను అతి దారుణంగా హత్య చేశాడు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.ఉత్తర్ ప్రదేశ్ లఖింపూర్ పరిధిలోని రాయ్ పూర్ ప్రాంతం. ఇక్కడే అభిషేక్ దీక్షిత్, వందనా శుక్లా దంపతులు నివాసం ఉంటున్నారు.
వీరికి 2014లో వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలానికి ఈ దంపతులు ఇద్దరూ సీతాపూర్ లో ఓ ఆస్పత్రి నిర్మించుకుని అక్కడే ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. అలా పెళ్లైన కొంత కాలం పాటు ఈ దంపతుల సంసారం బాగానే సాగుతూ వచ్చింది. ఇదిలా ఉంటే గత కొంత కాలం నుంచి ఈ దంపతుల మధ్య విభేదాలు వచ్చాయి. దీంతో ప్రతీ చిన్న విషయానికి భార్యాభర్తలు తరచూ గొడవ పడుతూ ఉండేవారు. అయితే ఈ క్రమంలోనే భార్య వందనా శుక్లా భర్తతో ఉండడం ఇష్టం లేక మరో ఆస్పత్రిలో ప్రాక్టీస్ చేస్తూ వచ్చింది. ఈ విషయం భర్తకు కోపాన్ని తెచ్చింది. దీంతో కోపంతో ఊగిపోయిన భర్త అభిషేక్ దీక్షిత్ తన తండ్రితో చేతులు కలిపి భార్యను చంపాలని అనుకున్నాడు.
ఇందులో భాగంగానే నవంబర్ 26న అభిషేక్ దీక్షిత్ తన తండ్రి ఇద్దరూ కలిసి వందనా శుక్లాపై దాడి చేసి దారుణంగా హత్య చేశారు. అనంతరం ఆమె శవాన్ని కనించకుండా దహనం చేశారు. ఇక వందనా శుక్లా కనిపించకపోవడంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక పోలీసుల విచారణలో ఒక నెల రోజుల తర్వాత వందనా శుక్లాను హత్య చేసింది ఆమె భర్త అభిషేక్ దీక్షిత్, అతని తండ్రి అని పోలీసులు తెలుసుకున్నారు. అనంతరం పోలీసులు వారిద్దరినీ అరెస్ట్ చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.