ఇతని పేరు ఇర్ఫాన్. సనా అనే అమ్మాయిని గత మూడు నెలల కిందటే వివాహం చేసుకున్నాడు. పెళ్లైన చాలా కాలం పాటు బాగానే ఉన్నారు. కట్ చేస్తే.. తాజాగా సనా ఇంట్లో ఫ్యానుకు వేలాడుతూ కనిపించింది. అసలేం జరిగిందంటే?
వాళ్లిద్దరూ భార్యాభర్తలు. వీరికి గత మూడేళ్ల కిందటే వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలం పాటు ఈ దంపతుల వైవాహిక జీవితం సాఫీగానే సాగుతూ వచ్చింది. కట్ చేస్తే.. ఇటీవల భార్య ఇంట్లో ఫ్యానుకు వేలాడుతూ కనిపించింది. ఈ సీన్ చూసిన మృతురాలి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా ఏడ్చారు. అసలేం జరిగిందంటే? పోలీసుల కథనం ప్రకారం.. ఉత్తర్ ప్రదేశ్ బాగత్ పరిధిలోని బారోట్ ప్రాంతం. ఇక్కడే ఇర్ఫాన్-సనా దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి మూడేళ్ల కిందటే వివాహం జరిగింది.
పెళ్లైన కొంత కాలం పాటు ఈ దంపతుల దాంపత్య జీవితం సాఫీగానే సాగుతూ వచ్చింది. అయితే రాను రాను భర్త, అత్తమామలు సనాను అదనపు కట్నం కోసం వేధింపులకు గురి చేసినట్లుగా తెలుస్తుంది. ఇదే విషయంపై అత్తమామలు స్పందించి అల్లుడు ఇర్ఫాన్ కు సర్దిచెప్పినట్లుగా సమాచారం. ఇకపోతే ఈ క్రమంలోనే సనా తాజాగా ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఈ విషయం తెలుసుకున్న మృతురాలి తల్లిదండ్రులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు.
కూతురుని అలా చూసి ఆమె తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడ్చారు. అనంతరం ఈ ఘటనపై సనా కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత కొంత కాలం నుంచి అదనపు కట్నం వేధిస్తున్నారని చిత్రహింసలకు గురి చేశారని, సనాను భర్త, అత్తింటివాళ్లే హత్య చేసి ఆత్మహత్యకు చిత్రీకరిస్తున్నారని అన్నారు. ఇక అత్తమామలే మా కూతురిని హత్యచేశారని సనా తల్లిదండ్రులు ఆరోపించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.