ఈ మధ్యకాలంలో కొందరు పెళ్లైన మహిళలు పడక సుఖం కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. భర్తను కాదని పరాయి మగాడితో వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఇక ప్రియుడితో గడిపేందుకు భర్త అడ్డుగా ఉన్నాడంటూ చివరికి హత్యలకు కూడా వెనకాడడం లేదు. అచ్చం ఇలాగే బరితెగించిన ఓ ఇల్లాలు ఎవరూ ఊహించని దారుణానికి పాల్పడింది. అసలేం జరిగిందంటే?
ఉత్తర్ ప్రదేశ్ లోని ఓ ప్రాంతంలో రాజేష్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతను గతంలో ఓ మహిళను వివాహం చేసుకున్నాడు. పెళ్లైన చాలా కాలం పాటు ఈ దంపతులు ఎంతో సంతోషంగా సంసారాన్ని నెట్టుకుంటూ వచ్చారు. అయితే రాజేష్ భార్య భర్త కళ్లు ఓ యువకుడితో వివాహేతర సంబంధాన్ని కొనసాగించింది. ఇదిలా ఉంటే ఇటీవల భార్యాభర్తలు ఇద్దరూ ఇంట్లో తిని పడుకున్నారు. అర్థరాత్రి భర్త రాజేష్ నిద్రలేచి చూసే సరికి.. బెడ్ రూంలో భార్య ప్రియుడితో నగ్నంగా కనిపించింది. ఈ సీన్ చూసిన భర్త ఒక్కసారిగా షాక్ గురయ్యాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
అది ఉత్తర్ ప్రదేశ్ బచ్రావాన్ పరిధిలోని తులేహండి. ఇదే గ్రామంలో రాజేష్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతనికి ఓ మహిళతో వివాహం జరిగింది. పెళ్లైన కాలం నుంచి ఈ దంపతులు ఎలాంటి గొడవలు లేకుండా దాంపత్య జీవితాన్ని కొనసాగిస్తూ వచ్చారు. కానీ, రాను రాను రాజేష్ భార్య తన బుద్దిని వక్రమార్గంలోకి నెట్టేసి పరాయి మగాడిపై మనసు పడింది. గ్రామంలోని మహతాబ్ అనే యువకుడితో రాజేష్ భార్య చీకటి కాపురాన్ని నడిపిస్తూ వచ్చింది. అలా కొంత కాలం పాటు వీరిద్దరూ తెర వెనుక సంసారం బాగానే నడపించారు.
ఇకపోతే.. మార్చి 30న రాజేష్, అతని భార్య, ఆమె ప్రియుడు మహతాబ్ కలిసి మద్యం సేవించారు. అనంతరం మహతాబ్ తన ఇంటికి వెళ్లిపోగానే.. రాజేష్, అతని భార్య తిని పడుకున్నారు. ఇక భర్త రాజేష్ జోరు నిద్రలోకి జారుకున్నాడు. ఇదే మంచి సమయం అనుకున్న భార్య.. ప్రియుడి మహతాబ్‌ని మళ్లీ ఇంటికి పిలిచింది. ప్రియురాలి మాటను కాదనని ఆమె ప్రియుడు.. ఆమె కోరినట్లు మళ్లీ రాజేష్ ఇంటికి వచ్చాడు. రాజేష్ పడుకున్నది చూసి ఇద్దరూ ఎంచక్కా బెడ్ రూంలోకి రొమాన్స్ కు తెర లేపారు. అయితే ఈ క్రమంలోనే ఇద్దరూ గొడవ పడ్డారు. అరుపులు విన్న రాజేష్ మెల్లగా నిద్రలేచాడు. కళ్లు తెరిచి చూడగా.. భార్య ప్రియుడితో బెడ్ రూంలో నగ్నంగా కనిపించింది.
ఈ సీన్ చూసిన భర్త రాజేష్.. ఒక్కసారిగా కోపంతో ఊగిపోయాడు. దీంతో ఆవేశంలో రాజేష్.. భార్య, ఆమె ప్రియుడిపై దాడి చేయబోయాడు. దీంతో అతని భార్య ప్రియడితో కలిసి భర్త రాజేష్ ను అతి దారుణంగా హత్య చేసింది. ఇక ఉదయం ఈ విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రాజేష్ మృతదేహాన్ని పరిశీలించారు. ఆ తర్వాత పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతుడి భార్యను విచారించగా.. అసలు నిజాలు బయటపెట్టింది. నేను ప్రియుడితో నగ్నంగా ఉండగా నా భర్త చూశాడు. దీంతో ఏం చేస్తాడోనన్నభయంతో ప్రియుడితో కలిసి నా భర్తను హత్య చేసినట్లు రాజేష్ భార్య ఒప్పుకుంది. ఇక పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ప్రియుడి కోసం తాళికట్టిన భర్తను దారుణంగా హత్య చేసిన ప్రియురాలి ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.