యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. ఏమైందో తెలియదు కాని యువతి ప్రియుడితో పెళ్లికి నిరాకరించి మరోకడితో పెళ్లికి సిద్దమైంది. దీంతో తట్టుకోలేకపోయిన ఆ భగ్న ప్రేమికుడు పెళ్లమండపంలోనే వధువుపై కాల్పులు జరిపాడు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలంగా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఉత్తర్ప్రదేశ్ మథుర నౌజీల్లోని ముబారిక్పుర్ గ్రామం. కాజల్ అనే యువతి స్థానికంగా ఉండే ఓ యువకుడితో ప్రేమలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే కొంత వీరి ప్రేమాయణం బాగానే సాగిన పెళ్లి వరకు మాత్రం రాలేదు.
ఇది కూడా చదవండి: Guntur: AP బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసులో సంచలన తీర్పు!
దీంతో ఆ యువతి ప్రియుడిని కాదని మరొక యువకుడితో పెళ్లికి సిద్దమైంది. తెల్లారితే పెళ్లి. బంధువులంతా హాజరయ్యారు. బాజా బజంత్రీలతో కళ్యాణ మండపం కళకళాడుతోంది. వధువు, వరుడు ఇద్దరు దండాలు మార్చుకున్నారు. ఇరువురి బంధువులంతా ఆశ్వీర్వాదించటానికి రెడీగా ఉన్నారు. వరుడు తాళికట్టే సమయంలోనే తుపాల శబ్దంతో దద్దరిల్లిపోయింది. వరుడు కళ్లు తెరిచి చూసేలోపే వధువు రక్తపు మడుగులో పడి కొట్టుకుంటోంది. యువతి మాజీ ప్రేమికుడు తుపాకితో కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో రక్తపు మడుగులో పడి ప్రియురాలు మరణించింది.
ఈ విషయం పోలీసులకు తెలియడంతో ఘటన స్థలానికి చేరుకుని విచారించారు. ఇక అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకంగా మారింది. ఈ హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపతున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.