ఓ మహిళ తొమ్మిది నెలల గర్భాన్ని మోసింది. నెలలు నిండాయి, డెలవరీ కోసం ఆస్పత్రికి తరలించారు. ఇక సర్జరీ చేయడంతో ఆ తల్లి పూర్తి ఆరోగ్యంతో ఉన్న ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయం తెలుసుకున్న తల్లి ఆనందానికి అవదులు లేవు. ఇక కుటుంబ సభ్యులంతా ఆనందంతో పరవశించిపోతున్నారు. ఇక పుట్టిన బిడ్డను ఓ నర్సు ఎలాంటి టవర్ సాయం లేకుండా తీసుకునే ప్రయత్నం చేసింది. ఉన్నట్టుండి ఆ పసిబాలుడు నర్సు చేతిలోంచి జారిపడి మరణించాడు.
ఇది కూడా చదవండి: ఇష్టం లేని పెళ్లి చేశారని కొత్తపెళ్లి కూతురు షాకింగ్ డిసిషన్!
దీంతో ఈ దృష్యాన్ని చూసిన ఆ తల్లి ఆర్తనాదాలు పెట్టడంతో కుటింబీకులంతా పరుగు పరుగు వచ్చారు. ఏం జరిగిందని తెలుసుకునే సరికి పుట్టిన బిడ్డకు తలకు గాయమై మరణించాడని ఆస్పత్రి వైద్యులు బుకాయించే ప్రయత్నం చేశారు. నర్సు నిర్లక్ష్యం కారణంగానే ఆ పసిబిడ్డ మరణించాడని కుటింబీకులంతా ఆగ్రహంతో ఊగిపోయారు. వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆస్పత్రికి చేరుకుని పరిశీలించారు.ఇక ఆ బాలుడి శవాన్ని పోస్ట్ మార్టంకు తరలించగా తలకు బలమైన గాయం కారణంగా మరణించాడని రిపోర్టులో వెల్లడైంది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆస్పత్రి సిబ్బందిపై చర్యలు తీసుకునేందుకు సిద్దమయ్యారు. ఉత్తర్ ప్రదేశ్ లఖ్ నవులో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా విషాదంగా మారింది. నర్సుల నిర్లక్ష్యంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.