దేశంలో మహిళలపై దారుణాలు రోజు రోజుకు ఎక్కువవుతున్నాయి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకూ ఎవరినీ వదలకుండా దారుణాలకు పాల్పడుతున్నారు. అచ్చం ఇలాంటి ఘటనే తాజాగా ఉత్తర్ ప్రదేశ్ లో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే?
దేశంలో జరుగుతున్న దారుణాలు చూస్తుంటే, వింటుంటే అసలు మనం మనషుల మధ్యే ఉన్నామా అనే అనుమానం రాకమానదు. ఇటు చిన్న పిల్లల నుంచి అటు వృద్దుల వరకు ఎవరినీ వదలకుండా బరితెగించి ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి అఘాయిత్యాలను అరికట్టేందుకు ప్రభుత్వాలు, నిర్భయ, దిశ వంటి చట్టాలు రూపొందించినా దుర్మార్గుల ప్రవర్తనలో ఎలాంటి మార్పు కనిపించకపోవడం బాధాకరం. అయితే అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ యువకుడు ఏకంగా 85 ఏళ్ల వృద్దురాలిపై దారుణానికి పాల్పడ్డాడు. వద్దని కాళ్లా, వేళ్లా పడ్డా ఆ కిరాతకుడు ఎంతకు కనికరించలేదు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలేం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. ఉత్తర్ ప్రదేశ్ హమీర్ పూర్ జిల్లాలోని బిన్వార్ ప్రాంతం. ఇక్కడే ఓ 85 ఏళ్ల వృద్దురాలు కుటుంబ సభ్యులతో పాటు నివాసం ఉంటుంది. నడవలేని స్థితిలో ఇంట్లోనే ఒంటరిగా కూర్చుంది. ఇదే సమయంలో అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి ఆ వృద్ధురాలిని గమనించాడు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో అతనికి పాడు ఆలోచన వచ్చింది. ఇక అస్సలు ఆలోచించకుండా వెంటనే ఆ ఇంట్లోకి వెళ్లి వృద్దురాలిపై బలవంతంగా అత్యాచారం చేశాడు. వద్దని ఆ ముసలావిడా కాళ్లా, వేళ్లా పడ్డా కూడా ఆ కామాందుడు అస్సలు కనికరించలేదు. అనంతరం ఈ దారుణ ఘటనపై ఆ వృద్దురాలు తన కుటుంబ సభ్యులకు వివరించింది. జరిగింది తెలుసుకున్న ఆ వృద్దురాలి కుటుంబ సభ్యులు.. వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎట్టకేలకు నిందితుడిని అరెస్ట్ చేశారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. 85 ఏళ్ల పండు ముసలవ్వపై అత్యాచారానికి ఒడిగట్టిన ఈ కామాందుడి దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.