అతడి పేరు సునీల్ కుమార్. వృత్తిరిత్యా ఆయన డిప్యూటీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ గా విధులు నిర్వర్తిస్తూ ఎన్నో ఏళ్లుగా సేవలు అందించారు. ఇకపోతే ఇటీవల ఆయన ఓ హోటల్ కు వెళ్లారు. చాలా సేపు అయిన గది నుంచి బయటకు రాలేదు. దీంతో హోటల్ సిబ్బందికి అనుమానం వచ్చి బలవంతంగా తలుపులు తెరిచి చూడగా షాక్ గురయ్యారు.
అది ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయోగ్ రాజ్ ప్రాంతం. ఇక్కడే సునీల్ కుమార్ అనే వ్యక్తి వృత్తిరిత్యా డిప్యూటీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. తన సర్వీసులో భాగంగా ఎన్నో ఏళ్లుగా సేవలు అందిస్తూనే ఉన్నాడు. ఇక పదోన్నతుల్లో భాగంగా అంటు వ్యాధుల నోడల్ అధికారిగా ఎంపికయ్యారు. అయితే సునీల్ కుమార్ సోమవారం ప్రయోగ్ రాజ్ లోని విఠల్ హోటల్ కు వెళ్లారు. ఎంత సమయం దాటినా ఆయన గది నుంచి బయటకు రాలేదు. హోటల్ సిబ్బందికి అనుమానం వచ్చి లోపలికి వెళ్లాలని అనుకున్నారు. కానీ, లోపలి నుంచి తలుపులకు గడియ పెట్టి ఉంది. దీంతో హోటల్ సిబ్బంది తలుపు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూసేసరికి సునీల్ కుమార్ ఫ్యానుకు వేలాడుతూ కనిపించాడు.
ఆ సీన్ చూసిన ఆ సిబ్బంది ఒక్కసారిగా షాక్ గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సునీల్ కుమార్ మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం అతడి శవాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇక ఈ విషయం తెలుసుకున్న మృతుడి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఆ తర్వాత ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే పోలీసుల ప్రాథమిక విచారణలో మాత్రం అతడు గత కొంత కాలంగా డిప్రెషన్ లో ఉన్నాడని, ఒత్తిడిని తట్టుకోలేకే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలింది. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఉత్తర్ ప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ సునీల్ కుమార్ ఆత్మహత్య ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.