పట్టపగలు ఇద్దరు యువకులు రెచ్చిపోయారు. నడుచుకుంటూ వెళ్తున్న విద్యార్థినిపై ఇద్దరు యువకులు తుపాకీతో కాల్చి చంపారు. తాజాగ చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారుతోంది. అసలేం జరిగిందంటే?
ఈ మధ్యకాలంలో దుండగులు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. పగ తీర్చుకోవడనికి ఎంతకైన తెగిస్తూ చివరికి హత్యలకు కూడా వెనకాడడం లేదు. అచ్చం ఇలాగే బరితెగించిన ఇద్దరు యువకులు దారుణానికి పాల్పడ్డారు. నడుచుకుంటూ వెళ్తున్న ఓ విద్యార్థినిపై యువకులు పట్టపగలు కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారుతోంది. అసలు ఈ ఘటన ఎక్కడ జరిగింది. అసలేం జరిగిందంటే? ఉత్తర్ ప్రదేశ్ జలౌన్ జిల్లాలోని అంధా గ్రామం. ఇక్కడే మాన్ సింగ్ అహిర్వార్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు.
ఇతని కుమార్తె రోష్టి అహిర్వార్ (22) కోట్రాలో డిగ్రీ చదువుతుంది. అయితే సోమవారం ఆ యువతి పరీక్ష రాసి ఇంటికి వెళ్తుంది. ఆ విద్యార్థిని కోట్రా మలుపు వద్దకు రాగనే ఇద్దరు యువకులు పల్సర్ బైక్ పై ఆమె వెనకాల వచ్చారు. ఇక వస్తూ వస్తూనే రోష్టిపై తుపాకీతో కాల్పులు జరిపారు. దీంతో ఆ యువతి అక్కడికక్కడే రక్తపు మడుగులో పడి ప్రాణాలు విడిచింది. వెంటనే ఆ యువకులు తుపాకీని అక్కడే వదిలేసి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ దీనిని గమనించిన కొందరు స్థానికులు అంతా పరుగు పరుగున అక్కడికి చేరుకుని వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఆ యువతి మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న మృతురాలి తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
उत्तर प्रदेश में दिन दहाड़े गोली मारी जा रही है,
जालौन के कोटरा मोड में बाइक में सवार दो युवकों ने दिन दहाड़े छात्रा की गोली मारकर हत्या कर दी ।@vinodkapri @rohini_sgh @sakshijoshii pic.twitter.com/Mx9wtEoco6
— Rohit Tripathi journalist (@rohitt_tripathi) April 17, 2023