కామంతో బరితెగించి ప్రవర్తిస్తున్న కొందరు కేటుగాళ్లు అడ్డగోలుగా అత్యాచారాలకు కాలు దువ్వుతున్నారు. ఇలాంటి ఘటనలోనే ఓ కామంధుడు ఆస్పత్రిలోనే యువతిపై దారుణానికి పాల్పడి విచక్షణరహితంగా దాడి చేశాడు. ఇటీవల జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం గోరఖ్ పూర్ పరిధిలోని సంత్ కబీర్ నగర్ ప్రాంతం. ఆస్పత్రిలో ఉన్న 22 ఏళ్ల యువతిపై ఓ దుర్మార్గుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా అందరి ముందు విచక్షణ రహితంగా కొట్టి యువతి ఇంటి ముందు వదిలేశాడు.
ఇది కూడా చదవండి: సొంత చెల్లిపై భయపెట్టి అన్న అత్యాచారం.. గర్బం దాల్చడంతో!
దీంతో వెంటనే స్పందించిన యువతి కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. తనపై ప్రమోద్ అనే యువకుడు అత్యాచారం చేశాడని యువతి తెలిపింది. ఇక చికిత్స తీసుకుంటూ యువతి సోమవారం మృతి చెందింది. దీంతో యవతి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.