వివాహేతర సంబంధాలు ఎంతటి అనర్థానికి దారితీరుస్తాయా అందరికీ విదితమే. అయినప్పటికీ ఐదు నిమిషాల శారీరక సుఖం తప్పటడుగులు వేస్తుంటారు. ఇలానే ఓ యువకుడు పెళ్ళైన మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఎవరు లేని సమయం చూసి ఇద్దరూ కలుసుకొని బాగానే ఎంజాయ్ చేసేవారు. చివరకు అలానే ఒకరోజు అర్ధరాత్రి సమయంలో వెళ్లి.. మహిళ అత్తింటివారికి పట్టుబడ్డాడు. ఆ తరువాత ఏం జరిగిందంటే..
పెళ్లి చేసుకోవడం.. పక్క చూపులు చూడటం.. దేశంలో ఇలా ఓర చూపులు చూసేవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. పెళ్లి కానీ వారు, పెళ్లైన వారు అన్న తేడా లేకుండా అందరూ శారీరక సుఖం కోసం తప్పటడుగులు వేస్తూనే ఉన్నారు. అలానే ఓ పెళ్లి కాని యువకుడు, పెళ్ళైన మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అప్పుడప్పుడు కలుసుకొని ఇద్దరూ బాగానే ఎంజాయ్ చేసేవారు. ఇది చాలదు అనుకున్నాడో ఏమో.. ఉన్నట్టుండి అర్ధరాత్రి ఆమెను కలుసుకోవడానికి వెళ్లి.. వివాహిత అత్తింటివారికి పట్టుబడ్డాడు. ఇంకేముంది.. యువకుడిని చితకబాదిన వారు.. అది కోసి చేతిలో పెట్టి పంపించారు. ఈ దారుణ ఘటన ఉత్తర్ ప్రదేశ్, ఝార్ఖండ్ సరిహద్దుల్లో చోటుచేసుకుంది.
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం… ఉత్తర్ ప్రదేశ్, సోన్‌భద్ర జిల్లా పరిధిలోని సలైయాదీ గ్రామానికి చెందిన అనిల్ అనే యువకుడు హరియాణాలో ఉద్యోగం చేస్తున్నాడు. అక్కడ అతడికి ఝార్ఖండ్‌లోని గఢ్వా ప్రాంతానికి చెందిన వివాహితతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా కొన్నాళ్లకు అక్రమ సంబంధానికి దారితీసింది. దీంతో ఆ యువకుడు ఆమెను తీసుకెళ్లిపోయి.. హరియాణాలో ఓ గది అద్దెకు తీసుకుని కాపురం పెట్టాడు. కొద్ది రోజులు వీరి సహజీవనం సజావుగా సాగినా.. వివాహిత అత్తింటివారు మిస్సింగ్ కేసు పెట్టడంతో కథ అడ్డం తిరిగింది. పోలీసులు ఆమెను తిరిగి భర్తకు అప్పగించారు.
ఇది జరిగాక కొన్నాళ్ళు మౌనంగా వీరిద్దరూ మళ్ళీ కలవడం మొదలుపెట్టారు. ఎంచక్కా వివాహిత భర్త లేని సమయం చూసి ఇంట్లోనే ఈ తతంగం కొనసాగించారు. గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ వ్యవహారం ఒకరోజు మహిళ కుటుంబసభ్యులు తెలిసింది. అతడికి ఎలాగైనా బుద్ధిచెప్పాలనుకున్నారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి ప్రియురాలిని కలిసేందుకు వచ్చిన అనిల్‌ను కాపుకాసి పట్టుకున్నారు. అనంతరం అతడిని ఓ స్తంభానికి కట్టేసి విచక్షణారహితంగా కొట్టారు. ఆపై ఒక పదునైన ఆయుధంతో అతడి నాలుకను సైతం కోసేశారు. ఈ ఘటన జరిగాక ఎలాగోలా బయటపడ్డ యువకుడు మొత్తానికి ఇంటికి చేరుకున్నాడు.
నోటి నుంచి రక్తం ధారాళంగా కారుతుండటాన్ని గమనించిన కుటుంబసభ్యులు.. యువకుడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు, అతడి నాలుకకు కుట్లు వేసి అతికించగలిగారు. ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు. ఈ విషయమై.. జిల్లా చీఫ్ మెడికల్ ఆఫీసర్ అనూప్ సిన్హా మాట్లాడుతూ.. ‘ఆదివారం రాత్రి తీవ్ర గాయాలతో యువకుడు ఆస్పత్రిలో చేరాడు. అతడి నాలుకను 2 నుంచి 3 అంగుళాలు మేర కత్తిరించారు. శస్త్రచికిత్స చేసి కుట్లు వేశాం.. ప్రస్తుతం యువకుడి ఆరోగ్యం నిలకడగా ఉంది. మాట్లాడడానికి మరింత సమయం పడుతుంది..’ అని తెలిపారు. యువకుడి తండ్రి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ విషయంపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.