భార్యాభర్తలిద్దరూ బ్యాంకు ఉద్యోగులే. కష్టపడి ఉద్యోగాలు చేస్తూ బాగానే కూడ బెట్టారు. కానీ భర్తకు డబ్బులు బాగా సంపాదించాలనే ఆశ కుతకుతలాడుతుండేది. ఇందులో భాగంగానే భర్త బ్యాంక్ ఉద్యోగానికి రాజీనామా చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి వెళ్లిపోయాడు. దీంతో తాను ఎంచుకున్న రంగంలో కూడా రాణించలేక భర్త అప్పులు పాలయ్యాడు. ఇక భార్య సంపాదనతో బతకలేక కుమిలిపోయి చిన్నపాటి వివాదంతో భార్యను దారుణంగా హత్య చేశాడు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.
అది ఉత్తర్ ప్రదేశ్ ఝజియాబాద్ లోని వసుందరా సెక్టార్. ఇదే ప్రాంతంలో వికాస్, కామ్యా మీనా అనే దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. భర్త బ్యాంకులో పెద్ద ఉద్యోగే కాగా భార్య కూడా ఓ బ్యాంక్ లో మేనేజర్ గా విధులు నిర్వర్తిస్తుంది. ఆర్థికంగా బలంగా ఉన్న వీరి కాపురం సంతోషంగానే సాగుతూ వచ్చింది. అయితే ఈ క్రమంలోనే భర్త బ్యాంకు ఉద్యోగాన్ని వదిలి రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి అడుగు పెట్టాడు. దీంతో కొన్నాళ్ల పాటు సంపాదించినా, కొన్ని రోజుల తర్వాత ఆ రంగంలో రాణించలేకపోయాడు.
ఇది కూడా చదవండి: డాక్టర్స్ దారుణం! పసిబిడ్డ తల్లికి కడుపులో కాటన్ పెట్టి.. కుట్లు వేసేశారు!
దీంతో అప్పుల పాలై రోడ్డున పడ్డాడు. ఇక ఇంట్లో ఉండి భార్య సంపాదనతో బతకాల్సిన పరిస్థితి భర్త వికాస్ కు వచ్చింది. దీంతో లోలోప కుమిలిపోయేవాడు. అయితే ఈ క్రమంలోనే భార్యాభర్తల మధ్య ఆర్థిక పరమైన అంశాల్లో గొడవలు తలెత్తాయి. కొంత కాలం పాటు భార్యాభర్తలు ఉప్పు, నిప్పులా మెలిగారు. ఇటీవల మరోసారి ఈ దంపతుల మధ్య వివాదం రాజుకుంది. ఇక భర్త కోపం ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది. ఏం చేయాలో తెలియక ఇంట్లో ఉన్న కత్తితో భార్యపై 20 సార్లు పొడిచాడు. భర్త దాడిలో భార్య అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.
అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకోవాలని భావించి మేడపైకి ఎక్కి దూకి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. తీవ్ర గాయాలపాలైన వికాస్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలంగా మారింది. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.