Crime News: రక్షణగా నిలవాల్సిన పోలీసే ఓ యువతిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ప్రేమ, పెళ్లి పేరు చెప్పి యువతిపై అత్యాచారం చేశాడు. తర్వాత పెళ్లి చేసుకోమంటే కుదరదన్నాడు. దీంతో యువతి విషం తాగింది. అనంతరం పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఉత్తర ప్రదేశ్, వారణాసికి చెందిన పురాణా పుల్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ అర్జున్ సింగ్ ప్రేమ, పెళ్లి పేరు చెప్పి ఓ యువతికి దగ్గరయ్యాడు. యువతితో శారీరకంగా కలిశాడు…
తాజాగా, యువతి తనను పెళ్లి చేసుకోవాలని అర్జున్‌ను కోరింది. ఇక, అప్పటినుంచి అతడు ఆమెను దూరం పెడుతూ వచ్చాడు. దీంతో సదరు యువతి మనస్తాపానికి గురైంది. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. ఓ సాయంత్రం పురుగుల మందు తాగి తనకు అన్యాయం చేసిన అర్జున్ సింగ్ పని చేసే పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. ఆ సమయంలో అర్జున్ సింగ్ స్టేషన్‌లో లేడు. అక్కడికి వెళ్లిన కొద్దిసేపటికే ఆమె పరిస్థితి విషమించింది. ఆమె విషం తాగిందని గుర్తించిన పోలీసులు వెంటనే ఆసుపత్రికి తరలించారు…
ఆసుపత్రి వైద్యులు ఆమెకు చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమెకు ఎలాంటి ప్రాణాపాయం లేదని వెల్లడించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సదరు పోలీస్ ఇన్‌స్పెక్టర్‌తో పాటు మరో పోలీస్‌పై కూడా కేసు నమోదైంది. వారిద్దరినీ ఉన్నతాధికారులు విధులనుంచి తొలగించారు. బాధితురాలికి న్యాయం జరిగేలా చేస్తామని హామీ ఇచ్చారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : ప్రియుడి కోసం అతడి ఇంటికెళ్లిన యువతి.. తాళ్లతో కట్టేసి కొట్టిన జనం!