ఓ టైలర్ జీవితాన్ని అంధకారం చేశారు కొందరు హిజ్రాలు. దుస్తులు కొనటానికి తీసుకెళ్లి అతడిపై దారుణానికి ఒడిగట్టారు. టీలో మత్తు మందు కలిపి ఇచ్చి మర్మాంగాన్ని కత్తిరించారు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్లో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఉత్తర ప్రదేశ్, శామ్లి జిల్లా, సోంటా రసూల్ పూర్‌కు చెందిన షహ్‌బాజ్ అనే వ్యక్తి టైలర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతడికి భార్య, ఓ కుమారుడు, కూతురు ఉన్నారు. హష్‌బాజ్ చింత, చీకుల్లేని కుటుంబంతో హాయిగా రోజులు గడిపేవాడు. ఇదిలా ఉండగా.. ఓ రోజు పింకీ, రేష్మా అనే ఇద్దరు హిజ్రాలు అతడి షాపు దగ్గరకు వచ్చారు.
బట్టలు కుట్టించుకోవాలని, అందుకు తగిన క్లాత్‌ను ఇప్పించాలని అతడ్ని కోరారు. అతడు సరేనన్నాడు. ఇద్దరూ షహ్‌బాజ్‌ను కారులో బయటకు తీసుకెళ్లారు. ఆ కారులో వారితో పాటు మరికొంత మంది కూడా ఉన్నారు. మార్గం మధ్యలో ఓ చోట కారు ఆపారు. అతడి కోసం ఓ టీ తీసుకొచ్చి ఇచ్చారు. టీ తాగిన తర్వాత అతడికి మైకం వచ్చింది. స్ప్రహ కోల్పోయి కారులోనే పడిపోయాడు. ఇదే అదునుగా భావించిన హిజ్రాలు తమ ప్లాన్‌ను అమలుపరిచారు.
అతడి మార్మాంగాన్ని కోసి పడేశారు. తర్వాత అతడ్ని తీసుకుపోయి ఢిల్లీ-సహరాన్‌పూర్ హైవే పక్కన పడేశారు. మెలుకువ వచ్చిన తర్వాత విపరీతమైన నొప్పి మొదలవ్వటంతో కిందకు చూసుకున్నాడు. మర్మాంగం లేకపోయే సరికి ఉలిక్కిపడ్డాడు. అక్కడినుంచి నేరుగా ఆసుపత్రికి వెళ్లాడు. కోలుకున్న తర్వాత పోలీసులను ఆశ్రయించాడు. హిజ్రాలు పింకీ, రేష్మాలతో పాటు మరికొందరిపై కేసు పెట్టాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.