‘పెళ్లి ఒకరితో.. శారీరక సుఖం మరొకరితో..’ ఇలాంటి వ్యవహారాలు నడుపుతున్న వారి అంతకంతకు పెరుగుతోంది. ఆడో.. మగో.. కామవాంక్షతో పక్క చూపులు చూడటం కామన్ అయిపోతోంది. ఇవన్నీ కొన్ని రోజుల వరకు గుట్టు చప్పుడు కాకుండా సజావుగా సాగినా.. బయటపడ్డాక విషాదంగా ముగుస్తున్నాయి. ఆ కోవకు చెందిందే ఈ వార్త. మహా తెలివిగల ఓ ఇల్లాలు, తన రంకు పురాణం భర్తకు తెలిసిందని.. అతన్ని లేపేసింది. అనంతరం అతడు ఆత్మహత్యాహాయత్నం చేశాడంటూ ఆస్పత్రికి తీసుకెళ్లింది. అయితే.. 13 ఏళ్ల కుమార్తె నిజం చెప్పడంతో.. మాయలేడి పథకం బట్టబయలు అయ్యింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని ఘాజియాబాద్‌లో చోటుచేసుకుంది.
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. కవిత, మహేష్ అనే దంపతులు ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో నివాసముంటున్నారు. వీరికి 13 ఏళ్ల కుమార్తె, 8 ఏళ్ల కుమారుడు ఉన్నారు. మహేశ్ సొంతంగా వెల్డింగ్ షాపు నిర్వహిస్తుండగా, కవిత స్థానికంగా ఉన్న ఒక హాస్పిటల్ లో నర్సుగా పనిచేస్తోంది. ఈ క్రమంలో అదే ఆస్పత్రిలోని ఇన్సూరెన్స్ విభాగంలో పనిచేస్తున్న వినయ్ శర్మ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం భర్త తెలియడంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. దీంతో అతడిని అడ్డుతొలగించుకోవాలని ప్లాన్ వేసింది.
ఒకరోజు మహేష్ గాఢనిద్రలో ఉండగా, ఊపిరాడకుండా చేసి అతన్ని చంపేసింది. అనంతరం ఆత్మహత్యాయత్నం చేశాడంటూ తాను పనిచేస్తున్న ఆస్పత్రికి తీసుకెళ్లింది. పరీక్షించిన వైద్యులు.. అతడు చనిపోయిన వార్తను పోలీసులకు చేరవేశారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఆమెను ప్రశ్నించగా.. తన భర్త మద్యానికి బానిసై రోజు తాగొచ్చి వేధిస్తుండేవాడని, ఏం జరిగిందో తెలియదు కానీ, ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపింది. అనుమానమొచ్చిన పోలీసులు వారి కుమార్తెను విచారించగ అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నాన్న నోరును అమ్మ నొక్కడం తాను కిటికీలోంచి చూశానని 13 ఏళ్ల బాలిక పోలీసులకు చెప్పింది.
‘గదిలో నుంచి ఓ రెండు నిముషాల తర్వాత కవిత బయటకి రాగానే కూతురు ఏం జరిగిందని అడిగింది.. నాన్న నోటిలో గుట్కా అంటుకుందని, దానిని తీశానని చెప్పిందని..’ పోలీసులకు వివరించింది. దీంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా వినయ్ శర్మతో వివాహేతర సంబంధం ఉన్నట్టు వెల్లడయ్యింది. ఇద్దరూ గుట్టుచప్పుడు కాకుండా నాలుగేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగుతున్నట్లు తెలిపారు. ఇరువురి మధ్య జరిగిన వాట్సాప్ ఛాటింగ్, కాల్ రికార్డింగులు ఆధారంగా ఇద్దరూ కలిసి మహేశ్‌ను హత్యచేసినట్టు పోలీసులు నిర్దారించారు. ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.