Breaking: ఉత్తర ప్రదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. నవ రాత్రుల సందర్భంగా దుర్గాదేవికి పూజలు నిర్వహిస్తుండగా పెను ప్రమాదం జరిగింది. హారతి కార్యక్రమంలో విద్యుత్ షాట్ సర్య్కూట్ అయి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా.. 60 మందికి పైగా గాయాలయ్యాయి. ఈ సంఘటన ఆదివారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన ప్రాథమిక వివరాల మేరకు.. ఉత్తర ప్రదేశ్‌లోని భదోహిలో నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తులు ప్రతి రోజు వందల సంఖ్యలో దుర్గాదేవి మండపానికి వచ్చి పూజా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఆదివారం రాత్రి దుర్గాదేవి పూజలో అపశృతి చోటుచేసుకుంది.
దుర్గాదేవికి హారతి నిర్వహిస్తుండగా విద్యుత్ షాట్ సర్క్యూట్ అయింది. దీంతో మండపంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో చిక్కుకుని ఐదుగురు మృతిచెందగా.. 60 మందికి పైగా గాయాలయ్యాయి. మృతుల్లో ముగ్గురు చిన్నారులు, ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. ఇక ప్రమాదం జరిగినపుడు మొత్తం 300 మంది భక్తులు మండపంలో ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను చికిత్స కోసం దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటల్ని అదుపులోకి తెచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.