Crime News: ప్రియుడి మోజులో పడి ఓ మహిళ దారుణానికి ఒడిగట్టింది. తన ఇద్దరు కూతుళ్లు, ప్రియుడితో కలిసి భర్త, అత్త, మరిదికి విషం పెట్టింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఉత్తరప్రదేశ్, గౌతమ్ బుద్ధనగర్ జిల్లా, తానా థన్‌కర్ ఏరియా, జునైద్‌పుర్ గ్రామానికి చెందిన దేవేంద్ర, రాజ్‌కుమారి భార్యభర్తలు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు జ్యోతి, అర్చనలు ఉన్నారు. అయితే, రాజ్‌కుమారి అదే ప్రాంతానికి చెందిన అభిషేక్‌తో గత కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. తమ సంబంధానికి దేవేందర్, అతడి కుటుంబం అడ్డుగా ఉందని ఇద్దరు భావించారు. కుటుంబం మొత్తాన్ని చంపటానికి ప్లాన్ వేశారు. ఇందుకు రాజ్‌కుమారి తన ఇద్దరు కూతుళ్లను కూడా భాగం చేసుకుంది. అభిషేక్ స్నేహితుడు వీరితో జత కలిశాడు.
వీరందరూ కలిసి తినే ఆహారంలో విషం కలిపి దేవేందర్, అతడి తల్లి, తమ్ముడికి పెట్టారు. విషం పెట్టిన ఆహారం తిన్న వారందరూ స్ప్రహ కోల్పోయారు. ఆ ముగ్గురు స్ప్రహ కోల్పోగానే నిందితులు అక్కడినుంచి పరారయ్యారు. తీవ్ర అస్వస్థకు గురైన బాధితులను పొరిగింటివారు ఆసుపత్రిలో చేర్పించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. హత్యల కుట్రకు పాల్పడ్డ నలుగుర్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Ameerpet Metro: మెట్రో లిఫ్ట్‌లో యువకుడి దారుణం.. యువతి ముందే బట్టలు విప్పి..