Crime News: ఓ ఊరి పెద్ద ఇంటి టాయిలెట్‌లో దేవుళ్ల బొమ్మలు దర్శనమిచ్చిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఉత్తర ప్రదేశ్, సీతా పూర్ జిల్లాకు చెందిన ఓ గ్రామ పెద్ద తన ఇంట్లోని టాయిలెట్‌లో దేవుళ్ల టైల్స్ వేయించుకున్నాడు. శివుడు, ఓం, పూజా కలశం ఉన్న టైల్స్‌ను వేయించుకున్నాడు. ఈ విషయం ఊరు మొత్తం పాకిపోయింది. దీంతో కొంతమంది దీనిపై బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. టాయిలెట్‌లో ఆ టైల్స్ వేసి నాలుగేళ్లకు పైనే అయిందని పోలీసులు గుర్తించారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
సదరు నిందితులు గ్రామ పెద్దగా గెలిచిన నేపథ్యంలో గ్రామంలోని చాలా టాయిలెట్స్లో హిందూ దేవుళ్ల టైల్స్ వేయించాలని చూశారని, దీనిపై అభ్యంతరం వ్యక్తం అవటంతో ఆ పనిని విరమించుకున్నారని ఫిర్యాదు చేసిన వారు చెప్పారు. కానీ, అంత గొడవ జరిగినా కూడా 8 నుంచి 10 టాయిలెట్లలో దేవుళ్ల టైల్స్ వేశారని తెలిపారు. గ్రామంలో ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరింత ప్రత్యేక శ్రద్ధతో కేసును దర్యాప్తు చేస్తామని పోలీసులు ఉన్నతాధికారులు, జిల్లా మేజిస్ట్రేట్ తెలిపారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Bihar: ఇలాంటి కష్టం పగవాడికి కూడా వద్దు.. కుమారుడి శవం కోసం బిచ్చమెత్తిన తల్లిదండ్రులు!
उत्तर प्रदेश सीतापुर रेउसा,थाना थानगांव के बर्रा बेरौरा में Mu स्लिम प्रधान द्वारा शौचालय में लगवाए गए हिन्दू देवी देवताओं के टाइल्स।
आख़िर कबतक हिन्दू देवी देवताओं के लिए अभद्रता बर्दाश्त करते रहेंगे हम तत्काल मामले को संज्ञान में लें @CopDisaster@DmSitapur @sitapurpolice pic.twitter.com/YAf2e9jFrl— कल्पना श्रीवास्तव 🇮🇳 (@Lawyer_Kalpana) June 9, 2022