crime news : చాలా మంది తల్లులు తమ రక్తం పంచుకుపుట్టిన పిల్లలు క్షేమంగా ఉండాలని, వాళ్లకు ఏ లోటూ లేకుండా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. తమకు ఎన్ని కష్టాలు వచ్చినా పిల్లల కోసం భరిస్తారు. ఏదైనా తప్పు చేయాల్సి వచ్చినా పిల్లల కోసమని సర్ధుకు పోతారు. అలాంటి మంచి తల్లులకు మచ్చగా మారిందో మహిళ. అప్పుడే పుట్టిన పాపను చంపటానికి బ్రతికుండగానే గొయ్యి తీసి పాతిపెట్టింది. అయితే, తలవరకు మాత్రమే పాతిపెట్టడంతో పాప బ్రతికి బయటపడింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లాకు చెందిన ఓ మహిళ ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
అయితే, ఆ పాప పుట్టడం ఆమెకు ఇష్టం లేనట్లు ఉంది. ఎలాగైనా పాపను వదిలించుకోవాలనుకుంది. ఇందుకోసం ఏ తల్లీ ఫాలోకాని పద్ధతిని ఫాలో అయ్యింది. గొయ్యి తీసి తల వరకు పాపను పాతిపెట్టింది. అనంతరం అక్కడినుంచి వెళ్లిపోయింది. అటుగా వెళుతున్న ఓ మహిళ పాప ఏడుపు వింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పాపను బయటకు తీశారు. దగ్గరలోని ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రి వైద్యులు ఎంతో కష్టం మీద పాపను సాధారణ స్థితికి తీసుకువచ్చారు. ప్రస్తుతం అబ్జర్వేషన్‌లో ఉంచారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : భీభత్సమైన ఫైట్ సీన్.. కలబడి కుమ్ముకున్న రెండు వర్గాలు..
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.