crime news : మూడ నమ్మకాల వలలో పడిన ఆ దంపుతులు దారుణానికి ఒడిగట్టారు. ఓ పిల్లాడిని బలిస్తే తమ ఇంట్లో దాగున్న గుప్త నిధులు బయటకు వస్తాయని భావించారు. సొంత అల్లుడ్నే హత్య చేశారు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని చిత్రకూట్లో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బంద జిల్లాలోని చిత్రకూట్, రాఘవపురికి చెందిన భులు వర్మ, ఉర్మిల భార్యా భర్తలు. పోయిన దీపావళి పండుగ రోజు వీరికో కల వచ్చింది. వారి ఇంట్లో ఓ పెద్ద గుప్త నిధి దాగి ఉందని, మొత్తం మూడు పెట్టెలనిండా ఆ నిధి ఉందని ఆ కలలో కనిపించింది.
అయితే, ఆ నిధిని బయటకు తీసుకురావాలంటే ఎవరైనా చిన్నపిల్లాడిని బలి ఇవ్వాలని, అప్పుడే ఆ నిధి ఇంట్లో ఎక్కడ ఉందో తెలుస్తుందని వారు తెలుసుకున్నారు. వీరి కన్ను అల్లుడిపై పడింది. ఆ బాలుడి ఇళ్లు నిందితుల ఇంటికి దగ్గరగా ఉంటుంది. బాలుడ్ని ఇంటికి తీసుకువచ్చి గొంతు నులిమారు.. అనంతరం కత్తితో పొడిచి చంపేశారు. శవాన్ని ధాన్యం దాచుకునే చోట దాచిపెట్టారు. క్షుద్ర పూజలు నిర్వహించటానికి సరైన సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు.
పిల్లాడు కనిపించకపోవటంతో తండ్రి రామ్‌ప్రయాగ్ రాయ్‌దాస్ ఫిబ్రవరి 8వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అయితే, పిల్లాడు ఎక్కడిపోయాడన్నది కనుక్కోవటం వారికి కష్టంగా మారింది. కొద్దిరోజుల తర్వాత భులు ఇంటినుంచి దుర్వాసన రావటంతో ఇంటి పక్కల వాళ్లు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ధాన్యాగారం నుంచి బాలుడి శవాన్ని స్వాధీనం చేసుకున్నారు. భార్యాభర్తలిద్దర్నీ అరెస్ట్ చేశారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : దారుణం: సొంత అక్కపై తమ్ముడి అఘాయిత్యం..
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.