Crime News: ట్రాన్స్‌ఫర్ కోరిన ఓ ఉద్యోగితో దారుణంగా ప్రవర్తించాడో బాస్. ట్రాన్స్‌ఫర్ కోసం భార్యను పంపమన్నాడు. దీంతో తట్టుకోలేకపోయిన ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఉత్తర ప్రదేశ్, లఖిమ్‌పుర్ ఖేరి జిల్లాకు చెందిన 45 ఏళ్ల గోకుల్ ప్రసాద్ యూపీ పవర్ కార్పొరేషన్‌లో చిరుద్యోగి. అక్కడే పనిచేస్తున్న జూనియర్ ఇంజినీర్ నాగేంద్ర కుమార్, ఓ క్లర్క్‌కు ప్రసాద్ అంటే గిట్టదు. గత 3 ఏళ్లుగా ఇబ్బంది పెడుతూ ఉన్నారు. కొన్ని నెలల క్రితం అతడికి అలీగంజ్‌కు ట్రాన్స్‌ఫర్ అయింది. అలీగంజ్ తనుండే ప్రాంతానికి దూరంగా ఉండటంతో ప్రయాణం భారంగా మారింది. ఈ నేపథ్యంలో తనను తన ఇంటికి దగ్గరగా ఉండే ప్రాంతానికి ట్రాన్స్‌ఫర్ చేయాలని వారిని అడిగాడు.
‘‘నీ భార్యను మా కోసం ఓ రాత్రి పంపించు. మేము నిన్ను ట్రాన్స్‌ఫర్ చేస్తాము’’ అన్నారు. వారి మాటలతో తీవ్ర మనోవేధనకు గురైన ప్రసాద్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. మంటల్లో కాలి చనిపోయాడు. ప్రసాద్ భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రసాద్ మరణానికి కారణమైన జూనియర్ ఇంజినీర్, క్లర్క్‌లను అధికారులు సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : భర్తకు స్లీపింగ్ టాబ్లెట్లు ఇచ్చి ప్రియుడితో భార్య..!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.