తర్వాత అతడ్ని దారుణంగా కొట్టారు. ఓ వ్యక్తి అంతటితో ఆగకుండా వేడి నూనె జయప్రసాద్ నడుంపై పోశాడు. దీంతో అతడి కింది భాగం మొత్తం కాలిపోయింది.
ఈ మధ్య కాలంలో జనాలు పూర్తిగా విచక్షణ మర్చిపోతున్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఎదుటి వ్యక్తుల్ని హింసిస్తున్నారు. తాజాగా, ఓ వంట మనిషిపై కొందరు వ్యక్తులు దారుణానికి పాల్పడ్డారు. పెళ్లిలో చేసిన వంటలో ఉప్పు ఎక్కువైందని అతడ్ని నూనెలో పడేశారు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఉత్తర ప్రదేశ్, లక్నోలోని గుడుంబాలో కొద్దిరోజుల క్రితం ఓ పెళ్లి జరిగింది. ఈ పెళ్లికి వంటలు చేయటానికి సువాన్షిపూర్‌లోని ఇటుంజా నుంచి చందర్, జయ ప్రసాద్‌లు వచ్చారు. పెళ్లిలో వంటలు చేశారు. అయితే, పెళ్లిలో చేసిన వంటల్లో ఉప్పు ఎక్కువైందంటూ పెళ్లి కూతురి తరపు వారు జయప్రసాద్‌తో గొడవపెట్టుకున్నారు.
తర్వాత అతడ్ని దారుణంగా కొట్టారు. ఓ వ్యక్తి అంతటితో ఆగకుండా వేడి నూనె జయప్రసాద్ నడుంపై పోశాడు. దీంతో అతడి కింది భాగం మొత్తం కాలిపోయింది. గట్టిగా అరుస్తూ.. అతడు విలవిల్లాడిపోయాడు. దీంతో అక్కడి వారు జయప్రసాద్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు ఆయనకు అత్యవసర చికిత్స అందించారు. అతడికి 70 శాతం గాయాలు అయినట్లు వైద్యులు తెలిపారు. సమచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరి, ఈ క్రైం స్టోరీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.