శృంగారం.. భార్యాభర్తల మధ్య బంధాన్ని మరింత బలపరచడంతో పాటు సంతోషమైన కాపురంగా సాగేందుకు తోడ్పుతుంది. ఇలా దంపతులు వైవాహిక జీవితంలో భాగంగా ఒకరి పట్ల ఒకరు ప్రేమతో మెలుగుతూ శృంగారాన్ని ఎంజాయ్ చేయాలి. ఇలా ఇద్దరి ఇష్టపూర్వకంగా శృంగారం చేస్తూ అనుభవించాల్సిన ఈ కార్యాన్ని కొందరు భర్తలు హద్దులు దాటి ప్రవర్తిస్తుంటారు. భార్యకు ఇష్టం లేని సమయాల్లో కూడా శారరీకంగా కలవాలంటూ కొందరు భర్తలు రంకెలేస్తుంటారు. అచ్చం ఇలాగే బరితెగించిన ఓ భర్త భార్యను ఒకే రాత్రిలో రెండుసార్లు సె*క్స్ చేయాలంటూ టార్చర్ పెట్టాడు. ఇక భార్య ఒప్పుకోకపోవడంతో భర్త దారుణానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఈ ఘటనలో అసలేం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుదాం.
ఉత్తర్ ప్రదేశ్ మోహ్రాలి పరిధిలోని కొత్వాలి ప్రాంతం. ఇక్కడే అన్వర్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతనికి గతంలో ఓ మహిళతో వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలానికి ఈ భార్యాభర్తలకు ముగ్గురు పిల్లలు జన్మించారు. పుట్టిన పిల్లలతో ఈ దంపతుల కాపురం సంతోషంగానే సాగుతూ వచ్చింది. అయితే గత కొన్నాళ్ల నుంచి భర్త అన్వర్ భార్యను అదనపు కట్నం తేవాలంటూ వేధింపులకు గురి చేసినట్లు తెలుస్తుంది. దీంతో ఇదే విషయంపై భార్యాభర్తల మధ్య తరుచు గొడవలు కూడా జరిగినట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఇటీవల ఓ రోజు రాత్రి భర్త అన్వర్ భార్యతో సె*క్స్ లో పాల్గొన్నాడు. భార్యకు ఆ సమయంలో ఇష్టం లేకపోయినా అతనికి సె*క్స్ లో సహకరించింది. ఇక అంతటితో ఆగని భర్త అదే రాత్రి మరలా సె*క్స్ చేయాలంటూ భార్యతో గొడవకు దిగాడు.
భార్య ఎంత చెప్పిన వినకపోవడంతో భార్య కోపంతో భర్తపై మాటల దాడికి దిగింది. ఇక కోపంతో ఊగిపోయిన భర్త దారుణానికి పాల్పడ్డాడు. కట్టలు తెంచుకున్న కోపంతో భర్త.. భార్య గొంతుకు తాడు బిగించి హత్య చేశాడు. అనంతరం తన సోదరుడి సాయంతో అన్వర్ తన భార్య మృతదేహాన్ని ఓ సంచిలో తీసుకెళ్లి ఎవరికీ కనిపించకుండా విసిరేశారు. ఇక తెల్లారేసరికి అతని భార్య కనిపించలేదు. ఈ విషయం ఆ మహిళ తల్లిదండ్రులకు కూడా తెలిసిపోయింది. దీంతో ఖంగారుపడ్డ ఆ మహిళ కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
ఈ క్రమంలోనే ఓ మహిళ శవం కనిపించడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించగా.. చనిపోయిన మహిళ అన్వర్ భార్యేనని పోలీసులు గుర్తించారు. ఇక అనంతరం పోలీసులు అన్వర్ ను అదుపులోకి తీసుకుని విచారించారు. మొదట్లో తనకేం సంబంధం లేదని చెప్పిన అన్వర్.. పోలీసుల స్టైల్ లో విచారించేసరికి అసలు నిజాలు బయటపెట్టాడు. రాత్రి నా భార్య నాతో రెండోసారి శృంగారానికి సహకరించలేదని, అందుకే హత్య చేశానని ఒప్పుకున్నాడు. ఆ తర్వాత అతడిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఇటీవల వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.