ప్రపంచంలో ఇప్పుడు ఎక్కడ చూసినా గన్ కల్చర్ పడగలు విప్పుతుంది. ఒకప్పుడు సెలబ్రెటీలు, ప్రముఖ వ్యాపారుల, రాజకీయ నేతల వద్ద ఉండే గన్ ఇప్పుడు సామన్యులకు సైతం అందుబాటులోకి వస్తున్నాయి. అక్రమ ఆయుధాల వ్యాపారం యదేచ్చగా సాగుతుంది.
ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా గన్ కల్చర్ విపరీతంగా పెరిగిపోయింది. అక్రమార్కుల నుంచి లైసెన్స్ లేని గన్స్ ఖరీదు చేసి ఎన్నో దారుణాలకు పాల్పపడుతున్నారు కేటుగాళ్ళు. ముఖ్యంగా అమెరికా లాంటి అగ్రరాజ్యంలో టీనేజర్స్ సైతం గన్ తో వీరంగాలు సృష్టిస్తున్నారు. గతంలో స్కూల్స్, చర్చీ, పబ్స్, హూటల్స్ లో సైకోలు గన్ తో విచక్షణారహితంగా కాల్పులు జరిపిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. తాజాగా అమెరికాలో మరో దారుణం చోటు చేసుకుంది.. ఓ సైకో జరిపిన కాల్పులు చిన్నారులు, స్కూల్ సిబ్బంది కన్నుమూశారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
టేనస్సీ స్టేట్ రాజధాని నాష్ విల్లేలోని ఓ ప్రైవేట్ ఎలిమెంటరీ స్కూల్ లో సోమవారం ఓ మహిళ విచక్షణారహితంగా కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో ఆరుగురు అక్కడిక్కడే చనిపోయారు. ఆ ఆరుగురిలో ముగ్గురు చిన్నారులు కాగా మరో ముగ్గురు స్కూల్ సిబ్బంది. అయితే కాల్పులకు తెగబడింది అదే స్కూల్ పూర్వ విద్యార్థిని అని పోలీసులు తెలిపారు. ఆమెను అక్కడే హతమార్చారు పోలీసులు. నాష్ విల్లే కు చెందిన ఆడ్రీ హెల్ ఆమె వయసు 28 సంవత్సరాలు. రహస్యంగా స్కూల్లోకి చొరబడిన ఆడ్రీ హెల్ ఎదురుగా ఉన్న స్టూడెంట్స్, స్కూల్ సిబ్బందిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపింది. దాంతో ఆరుగురు అక్కడే కుప్పకూలిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు క్షణాల్లో అక్కడికి చేరుకున్నారు.
స్కూల్ లో ఉన్న మిగతా పిల్లలను, సిబ్బందిని జాగ్రత్తగా బయటకు తీసుకు వచ్చారు పోలీసులు. అదే సమయంలో ఆమె మరోసారి దాడి చేసేందుకు సిద్దమవుతుండగా కాల్చివేశారు. అయితే ఆడ్రీ హెల్ ఆ స్కూల్ పూర్వ విద్యార్థిని.. ఆమె ట్రాన్స్ జెండర్ గా మారిందని పోలీసులు గుర్తించారు. గతంలో ఆడ్రీ హెల్ కి ఎలాంటి నేర చరిత్ర లేనప్పటికీ.. ఆమె తీవ్రమైన కోపంతోనే ఈ కాల్పులకు తెగబడినట్లు పోలీసులు తెలుపుతున్నారు. అంతేకాదు ఆమె మరిన్ని చోట్ల దాడులు చేసేందుకు పక్కా ప్లాన్ లో ఉందని.. అందుకు సంబంధించిన మ్యాప్ లు కూడా లభించాయని పోలీసులు తెలిపారు. కోపంతోనే ఆమె ఈ కాల్పలుకు పాల్పపడిందా? లేద వేరే ఏదైనా కారణం ఉండొచ్చా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇలాంటి ఘటనలు అమెరికాలో కొత్తేం కాదు.. గత ఏడాది టెక్సాస్ రాష్ట్రంలో ఉవాల్డే స్కూల్ లో కొంతమంది విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ దుర్ఘటనలో 19 మంది విద్యార్ధులు, ఇద్దరు టీచర్లు చనిపోయారు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే జో బైడెన్ ప్రభుత్వం ఆయుధ నిషేధ చట్టానికి మద్దతు ఇవ్వాలని రిపబ్లికన్లను వైట్ హౌజ్ లో ఓ ప్రకటనలో కోరింది. అమెరికా ఇలాంటి సామూహిక కాల్పుల ఘటనలు తరుచూ జరుగుతూనే ఉన్నాయి.. ప్రత్యేకించి స్కూల్స్, చర్చీలు, పబ్స్ లో జరుగుతున్నాయి.
#US: #Nashville school shooting leave multiple victims, suspect dead
Nashville police did not immediately return calls for more details.https://t.co/Et578EhfwZ
— The Times Of India (@timesofindia) March 27, 2023