అతీఖ్ అహ్మద్‌ను శనివారం రాత్రి కొందరు దుండగులు కాల్చి చంపారు. మీడియా ముసుగులో వచ్చి మాఫియా డాన్‌ను అంతమొందించారు. దేశవ్యాప్తంగా దీని గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మరి ఇంతకు ఎవరీ అతీఖ్ అహ్మద్.. అతడి నేర చరిత్ర వివరాలు ఏంటి అంటే..
ఉత్తరప్రదేశ్‌లో శనివారం రాత్రి గ్యాంగ్‌స్టర్ అతీఖ్ మీద చోటు చేసుకున్న కాల్పులు.. దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి. మాఫియా డాన్, గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్, అతడి సోదరుడు అష్రాఫ్‌లను పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో కాల్పులు జరిపి హతమర్చారు. ప్రయాగ్‌రాజ్‌లో శనివారం రాత్రి ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి. వీరిద్దరిని మెడికల్ చెకప్ కోసం జైలు నుంచి ఆస్పత్రికి తీసుకెళ్తుండగా.. గుర్తు తెలియని వ్యక్తుల.. పాయింట్ బ్లాంక్‌లో కాల్పులు జరిపి హతమర్చారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. పైగా అతీఖ్ మీడియాతో మాట్లాడుతుండగానే ఈ కాల్పులు చోటు చేసుకోవడం గమనార్హం. దుండగులు రిపోర్టర్ల ముసుగులో వచ్చి.. క్షణాల్లో కాల్పులు జరిపారు. ఈ సంఘటనతో అక్కడున్న వారు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు.
ఇక అతీఖ్ హత్యకు 48 గంటల ముందే అతడి కుమారుడు అహ్మద్ ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. శనివారం అహ్మద్ అంత్యక్రియలు జరగ్గా.. వాటికి హాజరయ్యేందుకు కోర్టు అనుమతి లభించకపోవడంతో.. అతీఖ్ జైల్లోనే ఉన్నాడు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అతీఖ్, అహ్మద్‌ల ఎన్‌కౌంటర్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇంతకు వీరిద్దరూ ఎవరు.. నేర సామ్రాజ్యానికి అధినేతలుగా ఎలా ఎదిగారు వంటి పూర్తి వివరాలు..
అతిఖ్ అహ్మద్.. ఇతడి పేరు చెబితే యూపీ గజగణ ఒణికిపోతుంది. దశాబ్దాలుగా.. యూపీలో ప్రభుత్వాలకు సమాంతరంగా నేర పాలన కొనసాగిస్తున్నాడు. మొదట్లో గ్యాంగ్‌స్టర్‌గా అతీఖ్ ప్రస్థానం ప్రారంభం అయ్యింది. ఆ తర్వాత నెమ్మదిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. దాంతో అతడి పవర్, పొజిషన్ పెరిగిపోయింది. లెక్కకు మించి నేరాలు చేశాడు. కానీ ఫిర్యాదు చేయడానికి జనాలు.. కేసు నమోదు చేయడానికి అధికారులు భయపడేవారు. పైగా గత ప్రభుత్వాల అండదండలు ఉండటంతో.. యూపీలో అతడి నేర సామ్రాజ్యం క్రమక్రమంగా విస్తరించి.. రాష్ట్రమంతా వ్యాపించింది. అంతేకాక అతీఖ్‌కు ఐసీసీ, లష్కరే తోయిబా వంటి ఉగ్ర సంస్థలతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు కూడా వచ్చాయి.
రాజకీయాల్లోకి అడుగుపెట్టిన అతీఖ్.. 1989 నుంచి 2004 వరకు అలహాబాద్ వెస్ట్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా పని చేశాడు. ఆ తర్వాత లోక్ సభకు ఎన్నికయ్యాడు. అతీఖ్ అహ్మద్‌పై వందకుపైగా కేసులు ఉన్నప్పటికీ.. 2017 ప్రారంభానికి ముందు వరకూ కూడా ఆయా కేసుల్లో.. బెయిల్ తెచ్చుకొని బయట తిరిగేవాడు. ఇక అతీఖ్ మీద తొలిసారి.. 1979లో అంటే 44 ఏళ్ల క్రితం తొలిసారి కేసు నమోదైంది. కానీ గత ప్రభుత్వాలు అతడ్ని ఏ ఒక్క కేసులోనూ దోషిగా తేల్చలేకపోయాయి. ఈ క్రమంలో 2022లో చోటు చేసుకున్న ఉమేష్ పాల్ హత్య కేసు అతీఖ్ ప్రస్థానానికి ముగింపు పలికింది.
యోగి అదిత్యనాథ్ ప్రభుత్వం ఈ కేసును సీరియస్‌గా తీసుకుంది. ఫలితం 44 ఏళ్ల నేర చరిత్రలో తొలిసారి అతీఖ్ అహ్మద్‌కు గత నెలలో జీవిత ఖైదు పడింది. అంతేకాక అతీఖ్ గ్యాంగ్‌కు చెందిన రూ. 1400 కోట్ల విలువైన ఆస్తులను యూపీ ప్రభుత్వం జప్తు చేసింది. 50 డొల్ల కంపెనీల గుట్టును ఈడీ బయటపెట్టింది. అతీఖ్ నేరాలు చేసి సంపాదించిన నల్ల ధనాన్ని ఈ డొల్ల కంపెనీలను ఉపయోగించుకొని వైట్‌గా మార్చుకున్నాడని ఈడీ విచారణలో తేలింది.
2005 జనవరి 5న ప్రయాగ్‌రాజ్‌లో బీఎస్పీ ఎమ్మెల్యే రాజు పాల్, అతడి అనుచరులపై కొందరు దుండగులు దాడి చేసి హత్య చేశారు. ఈ కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న లాయర్ ఉమేష్ పాల్ ఈ ఏడాది ఫిబ్రవరి 24న ప్రయాగ్‌రాజ్‌లో పట్టపగలే.. అందరూ చూస్తుండగా దారుణ హత్యకు గురయ్యాడు. అతీఖ్, అతడి భార్య పర్వీన్, అతడి కుమారుడు అసద్ తదితరులు ఈ హత్య చేశారని ఉమేష్ పాల్ కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ హత్య సీసీటీవీ కెమెరాల్లోనూ రికార్డయ్యింది. అతిఖ్ కుమారుడు అసద్ సహా ఐదుగుర్ని పోలీసులు గుర్తించారు.
ఈ కేసు విచారణలో భాగంగానే అసద్‌ను పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు.ఈ క్రమంలో ఉమేష్ పాల్‌ను హతమార్చిన.. ఈ మాఫియాను మట్టిలో కలిపేస్తానని అసెంబ్లీ సాక్షిగా యోగి ఆదిత్యనాథ్ మాట ఇచ్చారు. దాని ప్రకారమే 50 రోజుల్లోనే.. 44 ఏళ్ల నేర సామ్రాజ్యాన్ని మట్టిలో కలిపేశారు. శనివారం రాత్రి అతీఖ్ హత్య.. అంతకు ముందు అహ్మద్ ఎన్‌కౌంటర్‌తో.. మాఫియా డాన్, గ్యాంగ్‌స్టర్ అయిన అతిఖ్ అహ్మద్ సామ్రాజ్యం కుప్పకూలింది.
అతీఖ్ అహ్మద్‌తో పాటు అతడి ఇద్దరు మైనర్ కుమారులు జైల్లో ఉండగా, మూడో కుమారుడు అసద్.. బుధవారం ఝాన్సీలో జరిగిన పోలీసుల ఎదురుకాల్పుల్లో హతమయ్యాడు. అతీఖ్ భార్య షైస్టా పర్వీన్ పరారీలో ఉంది. ఝాన్సీ ఎన్‌కౌంటర్లో అసద్ అహ్మద్‌తో పాటు హతమైన గుల్హమ్ భౌతిక కాయాన్ని శనివారం ప్రయాగ్‌రాజ్‌లో ఖననం చేశారు. ఈ సందర్భంగా ప్రయాగ్ రాజ్‌లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అతీఖ్ 44 ఏళ్లుగా నిర్మించిన నేర సామ్రాజ్యాన్ని యోగి ఆదిత్యనాథ్ సర్కార్.. గత 48 రోజుల్లోనే కూకటి వేళ్లతో పెకిలించింది.
కాల్పులకు పాల్పడిన వ్యక్తులను లవ్‌లేశ్ తివారీ, సన్నీ, అరుణ్ మౌర్యగా గుర్తించారు. ఈ ఘటనలో ఓ పోలీస్ కానిస్టేబుల్, జర్నలిస్ట్‌కు గాయాలు కాగా.. వారు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాల్పుల అనంతరం ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. హత్యలపై విచారణకు ముగ్గురు సభ్యులతో జ్యుడీషియల్ కమిటీ ఏర్పాటుచేయాలని అధికారులకు సూచించారు. పలు ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
BIG: Gangster Atiq Ahmed and brother Ashraf killed when they were speaking to media in #Prayagraj pic.twitter.com/3ocVvMuQXZ
— Aditya Raj Kaul (@AdityaRajKaul) April 15, 2023