గ్యాంగ్ స్టర్ మరియు అతని సోదరుడిని గుర్తు తెలియని దుండగులు లైవ్ లో కాల్చి జరిపారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది.
ఉత్తరప్రదేశ్ లో లైవ్ లో మీడియాతో మాట్లాడుతుండగా దుండగులు పాయింట్ బ్లాంక్ లో గన్ పెట్టి మాఫియా డాన్ ను కాల్చి చంపారు. గ్యాంగ్ స్టర్ తో పాటు అతని సోదరుడిని కూడా కాల్చి చంపారు. దేశవ్యాప్తంగా ఈ ఘటన సంచలనం రేపింది. మీడియాతో మాట్లాడుతుండగానే పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్పులు జరిపిన దృశ్యాలు రికార్డు అయ్యాయి. గ్యాంగ్ స్టర్ మాజీ ఎంపీ అతీక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్ అహ్మద్ ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. శనివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.
శనివారం రాత్రి పోలీసులు అహ్మద్, అష్రఫ్లను ప్రయాగ్ రాజ్ లోని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తీసుకెళ్తున్నారు. ఆ సమయంలో మీడియా వారిని కొన్ని ప్రశ్నలు అడుగుతోంది.వాటికి ఇద్దరూ సమాధానం చెబుతుండగా తీసుకెళ్తుండగా ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు సినిమా స్టైల్ లో పాయింట్ బ్లాంక్ రేంజ్ లో గన్ పెట్టి కాల్చి చంపారు. దీంతో స్పాట్ లోనే అహ్మద్, అష్రఫ్ సోదరులు మృతి చెందారు. చుట్టూ పోలీసులు ఉన్నా కూడా కళ్ళు మూసి తెరిచే లోపు కాల్చి చంపేశారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను అరుణ్ మౌర్య, నవీన్ తివారీ, సోనుగా పోలీసులు గుర్తించారు.
అతీక్ అహ్మద్ గతంలో సమాజ్ వాదీ పార్టీ నుంచి ఎంపీగా ఎన్నికయ్యాడు. అంతకు ముందు ఐదు సార్లు ఎమ్మెల్యేగా కూడా పని చేశాడు. 2005 లో బీఎస్పీ ఎమ్మెల్యే రాజు పాల్ హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు అతీక్ అహ్మద్. అంతేకాదు ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో రాజు పాల్ అడ్వకేట్ ఉమేష్ పాల్ కూడా హత్య చేయబడ్డారు. ఈ హత్యలో అతీక్ అహ్మద్ హస్తం ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. వందకు పైగా క్రిమినల్ కేసులు అతీక్ అహ్మద్ పై ఉన్నాయి. కొన్ని కేసుల్లో దోషి అని తేలింది. కాగా అతీక్ కొడుకు అసద్ ఈ నెల 13న ఝాన్సీలో జరిగిన ఎన్ కౌంటర్ లో హతమైన సంగతి తెలిసిందే.
UPDATE: Three shooters arrested by UP Police for killing Gangster Atiq Ahmed and his brother Ashraf in Prayagraj. More details awaited. pic.twitter.com/zrJNeWffp5
— Aditya Raj Kaul (@AdityaRajKaul) April 15, 2023
Those who killed Atiq and his brother have been identified as Arun Maurya, Naveen Tiwari and Sonu.
#AtiqueAhmed #Prayagraj pic.twitter.com/ux8n442ET7— Md Asif Khan (@imMAK02) April 15, 2023