UP Crime: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆధిత్యనాథ్ ప్రధాన పూజారిగా ఉన్న గుడిలో ఓ అగంతకుడు అలజడి సృష్టించాడు. పదునైన కత్తితో పోలీసులు, స్థానికులపై దాడి చేశాడు. ఈ దాడిలో ఇద్దరు పోలీసులతో పాటు మరికొంతమంది గాయడపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గోరఖ్‌పూర్‌లోని గోరఖ్‌నాథ్ టెంపుల్‌లో ముఖ్యమంత్రి యోగీ ఆధిత్యనాథ్ ప్రధాన పూజారిగా ఉన్నారు. దీంతో ఈ గుడి రాష్ట్రవ్యాప్తంగా చాలా ఫేమస్ అయింది. నిన్న (ఆదివారం) సాయంత్రం అహ్మద్ ముర్తాజా అబ్బాసీ అనే వ్యక్తి పదునైన కత్తితో నిన్న ఈ గుడి దగ్గరకు చేరుకున్నాడు. మత సంబంధమైన నినాదాలు చేస్తూ గుడి లోపలికి చొరబడే ప్రయత్నం చేశాడు. ఈ నేపథ్యంలో గేటు దగ్గర ఉన్న పోలీసులు అతడ్ని అడ్డుకున్నారు. దీంతో అతడు పోలీసులపై కత్తితో దాడి చేశాడు.
అడ్డుకోవటానికి వచ్చిన వారిపై కూడా దాడి చేశాడు. స్థానికులు ఎంతో శ్రమకు ఓడ్చి అతడ్ని బంధించారు. గాయపడ్డ వారిని ఆసుపత్రిలో చేర్చారు. అతడ్ని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నిందితుడు గోరఖ్‌పూర్‌కు చెందిన వాడేనని, బాంబే ఐఐటీలో చదివాడని పోలీసులు తెలిపారు. అతడి వద్దనుంచి ఓ ల్యాప్‌ట్యాప్, సెల్‌ఫోన్, టికెట్‌ను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. అతడి వద్దనుంచి స్వాధీనం చేసుకున్న మరికొన్ని వస్తువులను బట్టి చూస్తే ఘటన వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని పేర్కొన్నారు. ఆ వస్తువులు సంచలనాలకు దారి తీస్తాయని, వాటి గురించి తర్వాత చెబుతామని అన్నారు. దీన్నో టెర్రర్ అటాక్ కాదని చెప్పలేమన్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : సొంత తమ్ముడి భార్యపై కన్నేసాడు.. మరదలితో పాటు కూతురిని కూడా వదల్లేదు!