ఈ రోజుల్లో ప్రేమ పేరుతో ఎన్నో దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రేమోన్మాది దాడుల్లో ఇప్పటికీ ఎంతో మంది అమాయక యువతులు బలైన విషయం తెలిసిందే. అయితే అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ ప్రియుడు విర్రవీగి ప్రవర్తించాడు. ప్రియురాలు పెళ్లికి ఒప్పుకోలేదని ఆమె కుటుంబ సభ్యులపై ఊహించని దారుణానికి పాల్పడ్డారు. తాజాగా గుంటూరు జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఈ దారుణ ఘటనలో అసలేం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
గుంటూరు జిల్లాలోని ఫిరంగిపురం గ్రామానికి చెందిన మణికంఠ అనే యువకుడు అదే గ్రామానికి చెందిన 16 ఏళ్ల బాలికను గత కొంత కాలంగా ప్రేమిస్తున్నాడు. అయితే మణికంఠ ప్రియురాలినే పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. కానీ ప్రియురాలు మాత్రం ప్రియుడితో పెళ్లికి నిరాకరించింది. దీంతో ఇదే విషయమై ప్రియుడు గత కొంత కాలం నుంచి ఆ బాలికతో గొడవ పడుతున్నాడు. ఎలాగైన ప్రియురాలిని తనతో పెళ్లికి ఒప్పించేందుకు అనేక ప్రయత్నాలు చేశాడు. కానీ ఎంత చేసినా ఆ బాలిక మాత్రం అతనితో పెళ్లికి నో అనే అంటుంది. ఈ నేపథ్యంలోనే ఇరు కుటుంబాలు వీరి పెళ్లి విషయమై చర్చలు జరిపారు. పెద్దల పంచాయితితో కూడా ఆ బాలిక మణికంఠతో పెళ్లి చేసుకోను అని చెప్పింది.
దీంతో బాలిక కుటుంబ సభ్యులు ఇటీవల మరో యువకుడితో నిశ్చితార్థం జరిపించారు. ఈ విషయం తెలుసుకున్న మణికంఠ కోపంతో ఊగిపోయాడు. తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రియురాలి ఇంటిపై దాడికి దిగాడు. వీరి దాడిలో ఆ బాలికతో పాటు ఆమె కుటుంబ సభ్యులు ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు గాయపడివారిని ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలోనే బాలిక మణికంఠ కుటుంబ సభ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్నఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.