హైదరాబాద్ లోని కొన్ని పబ్ లు బరితెగిస్తూ కాస్త శృతిమించుతున్నట్లు కనిపిస్తోంది. మాములుగా పబ్ లోకి వెళ్లాలంటే కనీసం 18 ఏళ్లు పైబడిన యువతీయువకులకు మాత్రేమే ప్రవేశానికి అనుమతినిస్తారు. కానీ తాజాగా నగరంలోకి ఓ పబ్ యజమానులు మాత్రం నిబంధనలకు నీళ్లొదిలి దారుణంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా గచ్చిబౌలిలోని లాల్ స్ట్రీట్ పేరుతో నడిపిస్తున్న ఓ పబ్ యజమానులు బరితెగించి ప్రవర్తించారు. ఏకంగా రెండేళ్ల బాలికను పబ్ లోకి ఎంట్రీ ఇచ్చి ఆ పాపతో డ్యాన్స్ చేయించారు.
దీనికి సంబంధించిన ఓ వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఆ బాలిక పబ్ లో ఉన్న వీడియోని కొందరు వ్యక్తులు తీసి డీజీపీ, సైబారాబాద్ సీపీకి ట్విట్టర్ లో ట్యాగ్ చేశారు. ఇక వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పబ్ యజమానులుకు నోటీసులు జారీ చేశారు. దీంతో పాటు పబ్ లోకి ఆ బాలికను ఎవరు తీసుకొచ్చారన్న కోణంలో పోలీసులు విచారణ వేగవంతం చేస్తున్నారు. ఇక బాలిక ప్రవేశించిన తీరుపై మాత్రం కొందరు వ్యక్తులు తీవ్రంగా మండిపోతున్నారు. ఇక పబ్ యజమనుల తీరుపై మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ల రూపంలో మాకు తెలియజేయండి.