సోమవారం ఇద్దరు మహిళలు నడి రోడ్డుపై బరితెగించి ప్రవర్తించారు. పట్టపగలు అందరూ చూస్తుండగానే లారీ డ్రైవర్ కంట్లో కారం కొట్టి దారుణానికి పాల్పడ్డారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
ఈ రోజుల్లో కొంతమంది చదువుకున్న వాళ్లు, చదువుకోనివాళ్లు కష్టపడకుండా ఈజీగా డబ్బులు ఎలా సంపాదించాలని ఆలోచిస్తున్నారు. కొందరు తెలివిగా ఆలోచిస్తూ పైసలు కూడబెడుతుంటే.., మరి కొందరు మాత్రం కష్టాన్ని నమ్ముకుని డబ్బును సంపాదిస్తుంటారు. కానీ, మరి కొంతమంది మాత్రం దొంగతనాలు, చైన్ స్నాచింగ్ వంటివి చేస్తూ చివరికి పోలీసులకు అడ్డంగా దొరికిపోతున్నారు. ఈ మధ్యకాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కువైపోతున్నాయి. అయితే ఈ దొంగతనాల జాబితాలో తాజాగా ఇద్దరు మహిళలు కూడా చేరిపోయారు. అవును.. మీరు విన్నది నిజమే. తాజాగా రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. అసలేం జరిగిందంటే?
అది తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా జడ్చర్ల సమీపంలోని రాయకల్ టోల్ ప్లాజా ప్రాంతం. సోమవారం ఉదయం ఇద్దరు మహిళలు అక్కడే నిలబడి ఉన్నారు. అదే సమయంలో హైదరాబాద్ నుంచి జడ్చర్ల వైపు వస్తున్న ఓ లారీని డ్రైవర్ టోల్ ప్లాజా వద్ద ఆపాడు. దీంతో అలెర్ట్ అయిన ఆ మహిళలు.. వెంటనే డ్రైవర్ కంట్లో కారం కొట్టి ఆ డ్రైవర్ వద్ద ఉన్న రూ.25 వేల నగదు, సెల్ ఫోన్ దొంగిలించే ప్రయత్నం చేశారు. ఆ డ్రైవర్ ఒక్కసారిగా పెద్దగా అరుపులు వేయడంతో అక్కడున్న వాహనదారులు వెంటనే అక్కడికి చేరుకుని ఆ మహిళలను పట్టుకున్నారు. ఇక క్షణాల్లో జనాలంతా అక్కడ వాలిపోయి ఆ మహిళా దొంగలను చితకబాదారు. అనంతరం వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఆ ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. పట్టపగలు డ్రైవర్ కంట్లో కారం కొట్టి దొంగతనానికి పాల్పడిన మహిళల తీరుపై మీరెలా స్పందిస్తారు? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
— Hardin (@hardintessa143) April 17, 2023