ఈ మద్య దేశ వ్యాప్తంగా ఎక్కడో అక్కడ పదుల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. అధికారులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా.. కొంతమంది డ్రైవర్లు చేసే నిర్లక్ష్యం వల్ల నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి.
దేశంలో ప్రతిరోజూ ఎక్కడో అక్కడ పదుల సంఖ్యల్లో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. డ్రైవర్లు చేస్తున్న తప్పిదాల వల్ల ఎంతోమది అమాయకులు బలి అవుతున్నారు. ఇంటి పెద్ద దిక్కు కోల్పోయి ఎన్నో కుటుంబాలు వీధిన పడుతున్నాయి. రోడ్డు భద్రతా చర్యలు ఎంత కఠినం చేసినా నిర్లక్ష్యం, అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు. ఆర్టీసీ బస్సు ఢీ కొన్ని ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. ఈ ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్ లోని మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఎంతో భవిష్యత్ ఉన్న ఇద్దరు విద్యార్థులు ప్రమాదంలో మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం.. బోడుప్పల్ లోని జాహ్నవి డిట్రీ కళాశాలకు చెందిన విద్యార్తులు భూమ సాయి కుమార్(22), అనిత (20) ఇద్దరు స్నేహితులతో సంఘీ టెంపుల్ కి వెళ్లీరు. బైక్ పై బోడుప్పల్ కు తిరిగి వస్తున్న సమయంలో ప్రతాప్ సింగారం పరిధిలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సమీపంలో ఆర్టీసీ ఢీ కొట్టింది.
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు విద్యార్థులు అక్కడిక్కడే మృతిచెందారు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుల తల్లిదండ్రులకు సమాచారం అందించారు. తమ పిల్లలను చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.