విశాఖ బీచ్ లో శవమై కనిపించిన శ్వేత ఘటన ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ కేసులో ఈ ఆధారాలే ఇప్పుడు కీలకంగా మారనున్నాయని పోలీసులు చెబుతున్నారు.
వైజాగ్ బీచ్ ఒడ్డున నగ్నంగా శవమై కనిపించిన వివాహిత శ్వేత మృతి కేసు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మంగళవారం కనిపించకుండా పోయింది. కట్ చేస్తే.. విశాఖ బీచ్ లో ఇసుక మధ్య నగ్నంగా శవమై కనిపించింది. దీనిని గమనించిన మార్నింగ్ వాకర్స్ వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శ్వేత మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే శ్వేత మరణం ఎన్నో అనుమానాలకు తావిస్తుంది. ఇంతకు శ్వేత ఆత్మహత్య చేసుకుందా? లేక ఎవరైనా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారా? ఆత్మహత్యే చేసుకుంటే ఒంటిపై దుస్తువులు లేకుండా ఉండడం ఏంటి? పైగా కొన్ని గాయాలు. అసలు ఏం జరిగిందనే దానిపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మరో ట్విస్ట్ ఏంటంటే?.. ఇప్పుడు శ్వేత భర్తతో మాట్లాడిన కాల్ రికార్డింగ్స్ కీలకంగా మారనున్నాయని తెలుస్తుంది.
శ్వేత-మణికంఠ దంపతులు. వీరికి గతేడాది వివాహం జరిగింది. అప్పటి నుంచి విశాఖలోని గాజువాకలో నివాసం ఉండేవారు. భర్త సాఫ్ట్ వేర్ ఉద్యోగి. కొన్నాళ్లపాటు ఇంటి వద్దే ఉంటూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేశాడు. అలా వీరి సంసారం పెళ్లైన రెండు నెలల పాటు సాఫీగానే సాగింది. ఇక అప్పటి నుంచి భార్యాభర్తల మధ్య మనస్పర్థలు భగ్గుమన్నాయి. మణికంఠ శ్వేతను ప్రేమగా చూసుకోకపోవడం, భార్య కన్నా తన కుటుంబమే ఎక్కువగా అన్నట్లు ప్రవర్తించడంతో శ్వేత తట్టుకోలేకపోయింది. ఇదే విషయంపై భార్యాభర్తలు తరుచు గొడవ పడేవారని తెలుస్తుంది. అయితే ఈ క్రమంలోనే శ్వేత గర్భం దాల్చింది.
ఇక ఇన్నాళ్లు ఇంట్లో ఉండి జాబ్ చేసిన భర్త.. వర్క్ ఫ్రమ్ హోమ్ ఎత్తేయడంతో ఈ మధ్యే హైదరాబాద్ వెళ్లాడు. దీంతో భార్య శ్వేత ఇంట్లోనే ఉండేది. గర్బవతి అన్న విషయం మరిచి భార్యను వదిలివెళ్లడం, పైగా ప్రేమగా చూసుకోకపోవడంతో శ్వేత తీవ్ర మనస్థాపానికి గురైంది. ఈ క్రమంలోనే మంగళవారం భార్యాభర్తలు ఫోన్ లో మాట్లాడుకుని గొడవ పడ్డారు. దీంతో వెంటనే శ్వేత సూసైడ్ నోట్ రాసి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. చాలా సమయం దాటిన శ్వేత ఇంట్లో కనిపించకపోవడంతో అత్తమామలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి విశాఖ బీచ్ లో శవమై తేలిందని తెలుసుకున్నారు.
కీలకంగా మారనున్న ఫోన్ కాల్ రికార్డ్స్:
గత కొన్ని రోజుల నుంచి భార్యాభర్తలు తరుచు గొడవ పడేవారట. ఈ క్రమంలోనే భర్త హైదరాబాద్ వెళ్లడంతో తరుచు ఫోన్ లో కూడా గొడవ పడేవారని తెలుస్తుంది. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో భార్యాభర్తలు ఫోన్ లో ఏం మాట్లాడుకున్నారు. అసలేం జరిగిందనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఈ కేసులో వీరి ఫోన్ కాల్ రికార్డింగ్స్ కీలకంగా మారనున్నాయని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో శ్వేత నిజంగానే ఆత్మహత్య చేసుకుందా? అసలేం జరిగిందనే పూర్తి వివరాలు తెలియాలంటే కొన్ని రోజులు ఆగక తప్పదు.