Swetha Reddy: శ్వేతారెడ్డి అనే వివాహిత అశోక్ అనే ప్రియుడితో మరో ప్రియుడు యశ్విన్ కుమార్‌ను హత్య చేయించిన సంగతి తెలిసిందే. పోలీసుల విచారణలో ఈ కేసులో నయా కోణాలు బయటపడినట్లు సమాచారం. శ్వేత చివరి నిమిషంలో యశ్విన్ హత్య ప్లాన్‌ను విరమించుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అశోక్‌కు మెసేజ్ చేసిందట. అయితే, ఆ మెసేజ్‌ను అశోక్ చూసుకోకుండా యశ్విన్‌ను సుత్తెతో కొట్టాడట. అంతేకాదు! యశ్విన్‌ను చంపాలన్న ఉద్ధేశ్యంతో తాను దాడి చేయలేదని, యశ్విన్ వెనుక నుంచి దాడిచేసి స్ప్రహ కోల్పోయేలా చేద్దామని కొట్టానని అశోక్ పోలీసుల విచారణలో చెప్పినట్లు సమాచారం.
కాగా, హైదరాబాద్‌లోని భాగ్ అంబర్‌పేటకు చెందిన యశ్విన్ అనే ఫొటో గ్రాఫర్‌కు మీర్‌పేట, నందీహిల్స్‌కు చెందిన వివాహిత శ్వేతారెడ్డితో ఫేస్‌బుక్‌లో పరిచయం అయ్యింది. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. వీరు తరుచూ ఏకాంతంగా కలిసేవారు. ఈ నేపథ్యంలో ఓ రోజు శ్వేతారెడ్డితో న్యూడ్ కాల్స్‌లో మాట్లాడాడు. వాటిని రికార్డ్ చేసుకుని పెట్టుకున్నాడు. ఆ న్యూడ్ వీడియోలతో ఆమెపై బెదిరింపులకు దిగాడు. తనను పెళ్లి చేసుకోవాలని, లేకుంటే ఫొటోలు, వీడియోలను ఆమె బంధువులకు పంపుతానని ఒత్తిడి తేసాగాడు. ఈ నేపథ్యంలో భయపడిపోయిన శ్వేత అతడి అడ్డు తొలగించుకోవాలనుకుంది.కృష్ణాజిల్లా తిరువూరు మండలం ఎరుకోపాడు గ్రామానికి చెందిన ఓ ప్రైవేటు కళాశాలలో వైస్ ప్రిన్సిపాల్‌గా పనిచేసిన కొంగల అశోక్ (28), ఎలక్ట్రీషియన్ కొత్తపల్లి కార్తీక్(30)లను రంగంలోకి దింపింది. ప్లాన్ ప్రకారం శ్వేతారెడ్డి ఈ నెల 3న యశ్విన్‌కు ఫోన్ చేసి ఇంటికి రమ్మంది. అతను అర్థరాత్రి ఇంటికి వెళ్లాడు. అక్కడ మాటు వేసిన అశోక్, కార్తీక్‌లు అతడి తలపై బలంగా కొట్టారు. దీంతో యశ్విన్ స్ప్రహ కోల్పోయాడు. అతడి దగ్గర ఉన్న ఫోన్‌ను తీసుకురమ్మని శ్వేత వారిని కోరింది. అయితే, యశ్విన్ దగ్గర ఫోన్ కనిపించలేదు. దీంతో వారు అక్కడినుంచి పారిపోయారు. ఆపస్మారక స్థితిలోకి వెళ్లిన యశ్విన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ కెమెరాల ఆధారంగా నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. మరి, కేసులో ఊహించని ట్విస్టుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Cyber Cheater: వీడు మామూలోడు కాదు.. ఏకంగా 250 మంది అమ్మాలను మోసం చేసి…