ఖమ్మం జిల్లాకు చెందిన ఈ వృద్ధ దంపతులు ఇటీవల పరుగుల మందు తాగారు. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఇక పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ ఆ దంపతులు తాజాగా మరణించారు. ఈ భార్యాభర్తలు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారో తెలుసా?
ఖమ్మం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఓ వృద్ధ దంపతులు పరుగుల మందు తాగారు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఇక పరిస్థితి విషమించడంతో ఆ దంపతులు శనివారం ఆస్పత్రిలోనే మరణించారు. ఈ ఘటనతో వారి బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అయితే వారు ఆత్మహత్య చేసుకున్న కారణం తెలిసి బంధువులు, స్థానికులు కన్నీటి సంద్రంలో మునిగిపోయారు. ఆ వద్ధ దంపతులు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు? అసలేం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. ఖమ్మం జిల్లా మధిర మండలం మడుపల్లి గ్రామం. ఇక్కడే నరసింహ్మయ్య (85), గౌరమ్మ (75) దంపతులు నివాసం ఉండేవారు. వీరికి ఓ కుమారుడు ఉన్నట్లు సమాచారం. పెళ్లైన నాటి నుంచి ఈ దంపతులు ఎంతో ప్రేమగా కలిసి జీవించారు. ఇకపోతే గత కొంత కాలం నుంచి వీరి కుటుంబంలో కలహాలు మొదలైనట్లు తెలుస్తుంది. ఇదే విషమమై తరుచు గొడవలు జరుగుతుండేవి. దీంతో ఆ వృద్ధ దంపతులు తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. ఇక ఇటీవల ఇంట్లో ఎవరూ లేని టైమ్ లో పురుగుల మందు తాగారు. అతని కుటుంబ సభ్యులు గమనించి వెంటనే ఆస్పత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతూ ఈ దంపతులు శనివారం ప్రాణాలు విడిచారు. దీంతో కుమారుడు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అనంతరం కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.