ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. దీంతో పలు చోట్లు చెరువులు, కాలువలు నీటితో నిండిపోయాయి. వేసవి కాలం కావడంతో కొంతమంది ఈతకోసం వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోతున్నారు.
మనిషి ప్రాణాలు ఎప్పుడు ఎలా గాల్లో కలిసిపోతాయో ఎవరూ చెప్పలేరు. అప్పటి వరకు మనతో ఎంతో సంతోషంగా ఉన్నవాళ్లు అకస్మాత్తుగా ఈ లోకం నుంచి శాశ్వతంగా దూరమైపోతారు.. టీవల తెలుగు రాష్ట్రాల్లో వరుస గుండెపోటు మరణాలు, రోడ్డు ప్రమాదాలు, ప్రకృతి వైపరిత్యాల వల్ల జరుగుతున్నమరణాలతో కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంటుంది. ముగ్గురు బాలికలు ఈతకోసం వెళ్లి చెక్ డ్యామ్ లో మునిగి చనిపోయారు. ఈ విషాద ఘటన నారాయణపేట జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
నారాయణపేట జిల్లా రాకొండ గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. చెక్ డ్యామ్ లో ఈతకోసం వెళ్లిన ముగ్గురు బాలికలు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. నర్వ మండలానికి చెందిన శ్రావణి (14), మహేశ్వరి (12) హైదరాబాద్ లో జరిగిన ఓ వివాహ వేడుకకు హాజరై అటునుంచి అమ్మమ్మ ఊరు అయిన రాకొండ గ్రామానికి చేరుకున్నారు. సోమవారం వీరి బంధువులు అయిన రాధిక(19) ని కలిశారు. ముగ్గురు ఈత కొట్టాన్న కోరిక కలిగింది. ఇంకేముంది దగ్గరలోని చెక్ డ్యామ్ వద్దకు వెళ్లి ఈత కొట్టాలని నిశ్చయించుకున్నారు. అయితే ఈత కొట్టాలన్న వారి కోరిక ప్రాణాల మీదకు తీసుకు వచ్చింది. చెక్ డ్యామ్ లోకి దిగిన ముగ్గరు మొదట లోతుగా లేని ప్రదేశంలో కొద్దిసేపు నీటితో ఆడుకొని తర్వాత అనుకోకుండా ఒకరి తర్వాత ఒకరు లోతు ప్రదేశంలోకి వెళ్లారు.
చెక్ డ్యామ్ లోతుగా ఉండటంతో ప్రమాదవశాత్తు నీటిలో ముగ్గురు మునిగిపోయి ఊపిరి ఆడక చనిపోయారు. ఈ విషయాన్ని స్థానికులు కుటుంబ సభ్యులకు తెలియజేశారు. అక్కడికి చేరుకున్న కుటుంబ సభ్యులు ముగ్గురు బాలికలను బయటకు తీశారు. అప్పటికే వారు మృతి చెందారు. పోలీసులు కేసు నమోదుచేసుకొని మృతదేహాలను పోస్ట్ మార్టానికి నారాయణపేట ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉంటే.. తెలంగాణలోని వనపర్తి జిల్లాలో ఘోర విషాదం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బాలికలు ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందారు. తాటిపాముల వీరసముద్రం చెరువు వద్దకు బట్టలు ఉతికేందుకు ముగ్గురు బలికలు వెళ్లారు. ప్రమాద వశాత్తు చెరువలో పడి గంధం తిరుపతమ్మ (16) గంధం సంధ్య (12) గంధం దీపిక (10)లు కన్నుమూశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు.