టాలీవుడ్ ప్రముఖ నటుడు కృష్ణుడుని పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా మియాపూర్ లోని శిల్పాపార్క్ లో పేకాట ఆడుతూ పోలీసులకు అడ్డంగా దొరికాడు. దీంతో రంగంలోకి దిగిన SOT పోలీసులు నటుడు కృష్ణుడితో పాటు తొమ్మిదిమందిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ పేకాట వ్యవహారంలో ప్రధాన నిందితుడిగా పెద్దరాజు అనే వ్యక్తిని గుర్తించారు పోలీసులు. నటుడు కృష్ణుడు వినాయకుడు, హ్యపీడేస్, జల్సా, మధుమాసం, ఒక్కడున్నాడు వంటి చిత్రాల్లో నటించాడు. మంచి నటుడిగా పేరు తెచ్చుకున్న కృష్ణుడు పేకాటలో పట్టుబడటం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.