డ్రంక్ అండ్ డ్రైవ్, ర్యాష్ డ్రైవింగ్ కారణంగా ఏటా వందల మంది బలవుతున్నా.. జనాల్లో మార్పు రావడం లేదు. అతి వేగంగా వాహనాలు నడుపుతూ.. అమాయకులు పాలిట యమకింకరులు అవుతున్నారు. వీరిలో సెలబ్రిటీలు కూడా ఉండటం గమనార్హం. తాజాగా ర్యాష్ డ్రైవింగ్ కేసులో టాలీవుడ్ హీరో దాసరి అరుణ్ అరెస్ట్ అయ్యాడు. ర్యాష్ డ్రైవింగ్ చేసిన కేసులో హీరో దాసరి అరుణ్ ను అరెస్ట్ చేసినట్లు సమాచారం. బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధి లోని సయ్యద్ నగర్ లో దాసరి అరుణ్… ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ గురువారం తెల్లవారు జామున 4 గంటల సమయంలో రెండు ద్విచక్ర వాహనాలను ఢీ కొట్టినట్లు సమాచారం అందుతోంది. ప్రస్తుతం బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో దాసరి అరుణ్ కుమార్ ఉన్నారని తెలుస్తోంది
ప్రమాదం సమయంలో దాసరి అరుణ్ మద్యం సేవించి ఉంటాడనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దాసరి అరుణ్ మీద కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. మరి కాసేపట్లో దాసరి అరుణ్ కి బ్రిత్ అనలైస్ పరీక్షలు నిర్వహించనున్నారు బంజారా హిల్స్ పోలీసులు. ఈ పరీక్షలలో అరుణ్ మద్యం సేవించినట్లు తేలితే.. కఠిన చర్యలు తప్పవని వారు హెచ్చరిస్తున్నారు. ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.