కారణం ఏదైనా ఆత్మహత్య నిర్ణయం అస్సలు సమర్థనీయం కాదు. ఎంత కష్టం వచ్చినా బలవంతంగా ప్రాణాలు తీసుకోవడం నేరం. తల్లిదండ్రులు ప్రతి విషయంలో పిల్లల సంతోషం కోరుకుంటారు. కానీ, పెళ్లి విషయంలో మాత్రం కొందరు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఆ తర్వాత పర్యావసానాలు అనుభవిస్తుంటారు. అలా బలవంతపు పెళ్లి చేసి.. అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ కుమార్తెను దూరం చేసుకున్నారో ఈ తల్లిదండ్రులు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం, లింగగిరికి చెందిన ఏకాంతం అనే వ్యక్తి హైదరాబాద్ లో ప్రైవేటు ఉద్యోగి. చర్లపల్లి, ఈసీనగర్ కు వలస వచ్చి స్థిరపడిపోయారు. అతని కుమార్తె శైలజ(22)ను మేనల్లుడు సతీష్ కి ఇచ్చి ఫిబ్రవరి 17న స్వగ్రామంలో ఘనంగా వివాహం చేశారు. ఆ వివాహం ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా బలవంతంగా చేసినట్లు తెలుస్తోంది. పెళ్లి చేసేస్తే సర్దుకుపోతుందిలే అనుకున్నారు. కానీ, అలా జరగలేదు. ఆమె మానసికంగా క్షోభ అనుభవించడం మొదలు పెట్టింది. ఆ మానసిక ఒత్తిడిలోనే షాకింగ్ నిర్ణయం తీసుకుంది.
పెళ్లి జరిగి వారం అయ్యాక ఫిబ్రవరి 22న తిరిగి నగరానికి వచ్చారు. శైలజ భర్త సతీష్ ఉద్యోగానికి వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఆమె తల్లి ఉన్న గదికి శైలజ గడియ పెట్టింది. హాలులో ఉన్న సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపారు. పోలీసులు వివరాలు కోరగా.. తమ కుమార్తెకు ఇష్టంలేని పెళ్లి చేయబట్టే ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.