పరువు కోసం పాకులాడే నేటి కాలంలో కొందరు తల్లి దండ్రులు ఎంతకైన తెగిస్తున్నారు. ఓ పూట తిండి లేకున్నా పరువే ముఖ్యమనుకునే ఈ రోజుల్లో అదే పరువు కోసం ఎంత దారుణాలకు అయిన తెగిస్తున్నారు. అచ్చం ఇలాంటి ఘటనే తాజాగా వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..జిల్లాల్లోని పర్వతగిరి ప్రాంతంలో ఉబ్బని సమ్మక్క అనే వివాహిత నివాసం ఉంటుంది. భర్త గతంలోనే మరణించటంతో ఇద్దరు కూతుళ్ల తోనే ఉంటూ కురగాయలు అమ్ముకుంటూ జీవనాన్ని కొనసాగిస్తూ ఉండేది. అయితే భర్త బతికి ఉండగానే పెద్ద కుమార్తె పెళ్లి ఘనంగా చేశారు.
ఇక చిన్న కూతురు అంజలి స్థానిక పాఠశాలలో పదవ తరగతి చదువుతోంది. కాగా ఇదే గ్రామంలో నివాసం ఉంటున్న తక్కువ కులస్తుడైన రాయపురం ప్రశాంత్ అనే యువకుడు అంజలితో ప్రేమలో పడ్డాడు. అంజలి కూడా ఇష్టపడడంతో కొంతకాలం ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఈ వ్యవహారాన్ని నడిపిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే అంజలి తల్లి సమ్మకి కూతురి ప్రేమ వ్యవహారం తెలిసింది. ఇలాంటి పనులు మనుకోవాలంటు తల్లి అనేక సార్లు మందలించింది.
బుద్ది మార్చుకొని కూతురు అదే పనిగా ప్రశాంత్ తో చెట్టా పట్టాలంటూ తెగ తిరుగుతోంది. కూతురు మారుతుంది అని తల్లి ఇన్నాళ్లు వేచి చూసినా ఆమె ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో పరువు పోతుందేమో అని బాగా ఆలోచించింది. ఏం చేయాలో అర్థం కాని సమ్మకు కూతురు ఇలాగే చేస్తే గ్రామంలో నా పరువు మంటగలుస్తుందని భావించి కూతురి హత్యకు ప్లాన్ వేసింది. ఇక గత నెల 19న సమ్మక్క తల్లి యాకమ్మతో కలిసి నిద్రిస్తున్న అంజలి ముఖంపై దిండు అదిమి దారుణంగా హత్య చేశారు. స్థానికుల సమాచారం మేరకు ముందుగా పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకున్నారు.
ఆ తర్వాత తల్లి సమ్మకు విచారించగా అసలు విషయాలు బయటపెట్టింది. తన కూతురి తక్కువ కులిస్తుడిని ప్రేమించిందని దీని కారణంగానే నేను, నా తల్లి చంపేశామంటూ తల్లి సమ్మక్క చెప్పింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారిద్దరిని రిమాండ్ కు తరలించారు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. కూతురు కులాంతర వివాహం చేసుకుంటుందేమోనని భయంతో చంపిన తల్లి సమ్మక్క తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.