సమాజంలో కామాంధుల చేష్టలు పేట్రేగిపోతున్నాయి. వారి కోరిక తీర్చుకునేందుకు వయసుతో సంబంధం లేకుండా.. దాడులు చేస్తున్నారు. కొందరు ముక్కు మొఖం తెలియని వాళ్లపై అఘాయిత్యాలకు పాల్పడుతుంటే.. ఇంకొందరు మాత్రం పరిచయస్తులనే టార్గెట్ చేసి అత్యాచారాలు చేస్తున్నారు. అలాంటి ఘటనపై విశాఖ జిల్లాలో వెలుగు చూసింది. తిరునాళ్లకు వెళ్లిన ఓ బాలికకు మాయమాటలు చెప్పి ఆమెను అక్కడి నుంచి కొండపైకి తీసుకెళ్లారు. అక్కడ ఒకరు అత్యాచారానికి పాల్పడగా.. ఇంకొక బాలుడు అందుకు సహకరించాడు. ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చదవండి: ప్రియుడి కోసం 2 ఏళ్ళ కూతురికి నరకం చూపించిన తల్లి!
వివరాల్లోకి వెళ్తే.. విశాఖ పెద్దగంట్యాడలో తొమ్మిదో తరగతి చదువుతున్న 14 ఏళ్ల బాలిక తెలిసిన అమ్మాయితో కలిసి తిరునాళ్లకు వెళ్లింది. అక్కడ గణేష్(19) అనే తెలిసిన యువకుడు అమ్మాయితో మాట్లాడాడు. బాధితురాలితో వచ్చిన అమ్మాయి ఇంటికి వెళ్దాం రామని కోరగా అందుకు బాలిక నిరాకరించింది. నేను కాసేపు ఆగి వస్తాను నువ్వు వెళ్లు అని పంపేసింది. ఆ తర్వాత గణేష్ ఆ బాలికతో కాసేపు మాట్లాడాడు. ఆ తర్వాత గణేష్ స్నేహితుడు గంగవరానికి చెందిన మైలపల్లి రాజు(27) అక్కడికి చేరుకున్నాడు. ఆ బాలికకు మాయ మాటలు చెప్పి ఆమెను బైక్ పై ఎక్కించుకుని యారాడ కొండపైకి తీసుకెళ్లారు.
కొండపై బాలికకు తోడుగా ఒకరు ఉన్నారు. రెండోవాళ్లు వెళ్లి మద్యం తీసుకొచ్చారు. ఆ తర్వాత గణేష్, రాజు ఇద్దరూ మద్యం తాగారు. మద్యం మత్తులో ఆ బాలికను అక్కడే ఉన్న పాడుబడిన షెడ్డులోకి లాక్కెళ్లారు. ఆ తర్వాత ఆ బాలికపై రాజు అత్యాచారం చేయగా.. అందుకు గణేష్ సహకరించాడు. రాజు బాలిక అని కూడా చూడకుండా తన కామవాంఛ తీర్చుకునేందుకు మృగంలా వ్యవహరించాడు. గణేష్ తెలిసిన బాలిక జీవితం నాశనం చేసేందుకు సహకరించాడు. ఆ తర్వాత బాలికను అక్కడే వదిలేసి ఇద్దరూ పరారయ్యారు.
ఇదీ చదవండి: భర్త కళ్ళ ముందే భార్యకి అవమానం..! కుర్రాళ్లంతా కలిసి!
ఆ సమయంలో బాలిక ఇంటికి ఫోన్ చేసింది. కానీ, ఎవరూ లిఫ్ట్ చేయలేదు. ఆ తర్వాత ఏం చేయాలో పాలుపోక ఆమె డయల్ 100కు కాల్ చేసింది. నైట్ పెట్రోలింగ్ లో ఉన్న పోలీసులు యారాడ కొండ సమీపంలో ఆమెను గుర్తించి పోలీసు స్టేషన్ కు తరలించారు. విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు తెలియజేశారు. ఆ తర్వాత బాలికను వైద్య పరీక్షల నిమిత్తం కేజీహెచ్ కు తరలించారు. ఆమె చెప్పిన వివరాల ప్రకారం.. గణేష్, రాజులను పోలీసులు అరెస్టు చేశారు. వారిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఆ తర్వాత వారిని దిశ పోలీసులకు అప్పగించారు. వారిని కఠినంగా శిక్షించాలంటూ బాలిక తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనరపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి.