టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కి ప్రపంచం అభివృద్ధి వైపు పరుగులు తీస్తుంటే.. ఇంకా కొన్ని మారుమూల ప్రాంతంల్లో మూడ నమ్మకాలు బలపడుతున్నాయి తప్పా.. చెక్కచెదరడం లేదు. అవును.. మీరు విన్నది నిజమే. ఇలా కొందరు మనుషుల కన్నా మూడనమ్మకాలే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. వీటి మాయలో పడి కొందరు పశువులను బలవ్వటం నుంచి అవసరమైతే మనుషులను కూడా బలిస్తున్నారు. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ నవ వధువు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.
తాజాగా ఏపీలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మైలపిల్లి హరి, నరసయమ్మ ఇద్దరు భార్యాభర్తలు. వీరికి రెండు నెలల కిందటే వివాహం జరిగింది. అయితే పెళ్లైన కొంత కాలానికి చేపలుప్పాడ సమీపంలోని గోవుపేటలో ఓ ఇల్లు అద్దెకు నివాసం ఉంటున్నారు. కొత్త జంట కాబట్టి కొన్ని రోజులు సంతోషంగా ఉన్నారు. కానీ రోజులు మారుతున్న కొద్ది భర్త ఓ రకంగా ప్రవర్తించేవాడు. మరో విషయం ఏంటంటే ఇతనికి మూడనమ్మకాలపై కాస్త ఇంట్రెస్ట్. ఇదే కాకుండా మాయలు, మంత్రాలు కూడా చేస్తుంటాడట.
తను అనుకున్నది జరుగుతుందంటే చాలు మనుషులను చంపటానికి కూడా రెడీ. కాగా గురువారం రాత్రి ఇంట్లో తన భార్యకు నరకం చూపించాడీ దుర్మార్గుడు హరి. భార్య చాతిపై వాతలు పెట్టి, కాళ్లకు, మేడకు తాడు బిగించి పైశాచికంగా వ్యవహిరించి భార్యను హతమార్చాడు. ఇక తెల్లారే సరికి నరసయమ్మ కుటుంబ సభ్యులు ఫోన్ చేస్తే సమాధానం రాలేదు. దీంతో అనుమానమొచ్చి ఇంటికొచ్చి చూసే సరికి ఆ వివాహిత విగత జీవిలా పడి ఉంది. ఈ సీన్ చూసి నరసయమ్మ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.
అక్కడే ఉన్న భర్త హరిని నిలదీయగా అతని నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి నిందితుడిని అరెస్ట్ చేశారు. మూడనమ్మకాల కారణంగానే తన భార్యను హత్య చేసి ఉంటాడని స్థానికులు వాపోతున్నారు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికగా తీవ్ర కలకలంగా మారింది. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.