దేశ వ్యాప్తంగా ప్రతిరోజూ ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరిగి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు.
దేశంలో ప్రతిరోజూ రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగిపోతూనే ఉన్నాయి. డ్రైవర్లు చేస్తున్న తప్పిదాల వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు. ఎన్నికఠిన చర్యలు తీసుకున్నా ఎక్కడో అక్కడ ఈ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. కొంతమంది డ్రైవింగ్ పూర్తిగా రాకున్నా రోడ్లపైకి వచ్చి ప్రమాదాలకు కారణం అవుతున్నారు. ఈ ప్రమాదాల్లో ఎంతోమంది అమాయకులు తమ ప్రాణాలు కోల్పోతున్నారు. ఎంతోమంది తన వైద్యసేవలు అందించిన ఓ డాక్టర్ రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. వివరాల్లోకి వెళితే..
ఇటీవల దేశంలో రోడ్డు ప్రమాదాలు బాగా పెరిగిపోయాయి. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో ఎంతోమంది వైద్యులు తమ ప్రాణాలకు తెగించి కరోనా బాధితులను కాపాడారు. అలాంటి వారిలో మునగపాకకు చెందిన వైద్యుడు మళ్ల మురళీకృష్ణ. రాంబిల్లి మండలం సోలార్ పరిశ్రమ వద్ద శనివారం రోడ్డు ప్రమాదంలో మురళీ కృష్ణ కన్నుమూశారు. మాజీ జడ్పీటీసి, మునగపాక గ్రామానికి చెందిన మళ్ల సంజీవరావు కి ముగ్గురు కుమారులు.. ఒక కూతురు. వారిలో చిన్న కుమారుడు మురళీ కృష్ణ చిన్నప్పటి నుంచి ప్రజా సేవ చేయాలనే తపనతో ఉండేవాడు. వైద్య విద్య అభ్యసించి.. విశాఖ, అచ్యుతాపురం తదితర ప్రాంతాల్లో డాక్టర్ గా వైద్యసేవలు అందించారు.
మురళీ కృష్ణ సతీమణి పుష్ప విశాఖలో కేజీహెచ్ లో జనరల్ సర్జన్ గా సేవలందించారు. ఈ మద్యనే అగనంపూడి హాస్పిటల్ లో జనరల్ సర్జన్ గా బాధ్యతలు చేపట్టారు. ఈ దంపతులు అగనంపూడిలో కొంతకాలంగా నివాసం ఉంటున్నారు. మురళీ కృష్ణ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నాడు. శనివారం మధ్యహ్నం రాంబిల్లి మండలంలో పరిధిలో వైద్య సేలందించేందుకు వెళ్లి సోలార్ ఫార్మ కంపెనీ వద్ద డివైడర్ కి ఢీ కొట్టడంతో మృతి చెందారు. మురళీ కృష్ణ హెల్మెట్ ధరించి ఉంటే ప్రమాదం నుంచి బయటపడి ఉండేవాడని స్థానికకులు ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్ మరణంతో మునగపాకలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నా యి. మురళీకృష్ణ కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోధించారు.