ప్రేమ పేరుతో జరుగుతున్న మోసాలు, దారుణాలకు అంతే లేకుండా పోతోంది. ప్రేమించానని చెప్పడం, చెట్టాపట్టాలేసుకు తిరిగేయడం, కోరికలు తీర్చుకోవడం. పెళ్లి అనేసరికి మాత్రం ముఖం చాటేయడం. ఈ ట్రెండ్ ఇంకా నడుస్తూనే ఉంది. ఈ యువతి జీవితంలోనూ అదే జరిగింది. ఎనిమిదో తరగతి చదువుతున్న సమయంలోనే ప్రేమన్నాడు. నువ్వే నా భార్య అందులో ఎలాంటి డౌట్ లేదంటూ నమ్మబలికాడు. కర్ణాటక, హంపి, హైదరాబాద్ ప్రాంతాలకు తిప్పాడు. నమ్మేసిన యువతి సర్వస్వం అర్పించుకుంది. తీరా పెళ్లి అనేసరికి నా వల్ల కాదంటూ చేతులెత్తేశాడు. ఏం చేయాలో తెలియని ఆ యువతి పోలీసులను ఆశ్రయించింది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్రిక్ చేయండి.
వివరాల్లోకి వెళితే.. ఈ ఘటన జరిగింది మరెక్కడో కాదు.. విశాఖపట్నంలోనే. పెదతీనార్లకు చెందిన ఆశ డిగ్రీ వరకు చదువుకుంది. ఎనిమిదో తరగతిలోనే అదే గ్రామానికి చెందిన మైలపల్లి రాము ఆమెను ప్రేమ పేరుతో ముగ్గులోకి దించాడు. తెలిసీతెలియని వయసులో అతని మాటలకు లొంగిపోయింది. ప్రేమ పేరుతో మరింత దగ్గరయ్యాడు. శారీరకంగానూ తన కామవాంఛలను తీర్చుకోవడం మొదలుపెట్టాడు. అడిగిన ప్రతిసారి నిన్ను కాకుండా ఇంకొకరిని చేసుకోను అంటూ నమ్మించేవాడు. కర్ణాటక, హంపి, హైదరాబాద్ వంటి ప్రాంతాలకు తిప్పాడు. ఆమె అతని మాయలో పూర్తిగా పడిపోయింది. అతను ఏం చెప్తే అదే నిజం, ఏదడిగినా కాదనకుండా ఇవ్వడం మొదలు పెట్టింది.
పెళ్లి గురించి కోటి ఆశలతో ఉన్న యువతికి షాకింగ్ వార్త తెలిసింది. ఆమె కలల రాకుమారుడు, ప్రియుడు వేరే యువతితో పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమయ్యాడు. ఆమె నిలదీస్తే మీరు కట్నం ఇవ్వలేరు అనే సాకుతో తప్పించుకోవాలని చూశాడు. గట్టిగా అడిగితే నేను పెద్దవాళ్లను కాదని నిన్ను పెళ్లాడలేను అంటూ చేతులెత్తేశాడు. ఏం చేయాలో పాలుపోని యువతి తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పింది. తమకు న్యాయం చేయాలంటూ విషయాన్ని పెద్దల దగ్గర పంచాయితీ పెట్టారు. ఆ యువతిని కోడలిగా చేసుకునే ప్రసక్తే లేదని వాళ్లు పంచాయితీలో తేల్చి చెప్పారు. వేరే యువతితో వివాహానికి ముహూర్తం కూడా పెట్టుకున్నట్లు చెప్పారు.
ఇదీ చదవండి: అమ్మతనానికే మచ్చ! తాగిన మత్తులో కూతురిపై తల్లి దారుణం!
ఏం చేయాలో తెలియని యువతి పెద్దల సాయంతో పోలీసులను ఆశ్రయించింది. తనను మోసం చేసిన యువకుడితో వివాహం జరిపించి న్యాయం చేయాలంటూ కోరుకుంది. అతనితో కలిసి దిగిన ఫొటోలు, వాళ్లు చేసుకున్న వాట్సప్ చాటింగ్ మొత్తం పోలీసులకు అప్పగించింది. యువతి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇంతగా ఆమెను మోసం చేయాలని చూసిన యువకుడిని పెళ్లి చేసుకుని ఆ యువతి ఆనందంగా ఉండగలదా? తీరా ఒత్తిళ్లకు లోబడి పెళ్లి చేసుకున్నా కూడా అత్తింటి వాళ్లు ఆదరిస్తారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.