అల్లారు ముద్దుగా పెంచిన అమ్మ.. గోరు ముద్దలు తినిపిస్తూ లాలించిన అమ్మ.. కంటికి రెప్పలా కావలి కాసిన అమ్మ మరణాన్ని తట్టుకోలేకపోయాడు. తల్లి తన వల్లే మరణించిందనే బాధతో అమె పోయిన కొద్దిసేపటికే తన ప్రాణాలు తీసుకున్నాడు. ఆ ఇంట్లో కొన్ని గంటల వ్యవధిలో రెండుసార్లు వాళ్లు శ్మశానానికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
వివరాల్లోకి వెళ్తే.. వికారాబాద్ జిల్లా యాలాల మండలం బెన్నూరులో తలారి నరేష్(30) తన కుటుంబంతో నివాసముంటున్నాడు. అతనికి తండ్రి ఎల్లప్ప, తల్లి లక్ష్మి(60), అన్న, చెల్లి ఉన్నారు. నరేష్ శనివారం తల్లిని కొడంగల్ లోని గుడికి తీసుకెళ్లాడు. దర్శనం చేసుకున్న తర్వాత తన బండిపై ఎక్కించుకుని తిరిగి ఇంటికి వస్తుండగా ప్రమాదం జరిగింది. రోడ్డంతా గుంతలు పడి ఉండటంతో బైక్ పైనుచిం లక్ష్మి ప్రమాదవశాత్తు కింద పడిపోయింది. ఆ విషయాన్ని గమనించకుండా నరేష్ వెళ్లిపోయాడు. ఆ తర్వాత వెనుక వస్తున్న వారు గమనించి చెప్పగా.. వెనక్కి వెళ్లాడు. అప్పటికే ఆమెకు ఒళ్లంతా గాయలు అయ్యాయి.
తీవ్ర గాయాలతో ఉన్న తల్లిని నరేష్ స్థానిక ఆస్పత్రికి తరలించాడు. అప్పటికే ఆమె చనిపోయిందని వైద్యులు నిర్ధారించారు. ఆ వార్తతో నరేష్ గుండెలు పగిలేలా రోదించాడు. ఆ విషాన్ని వెంటనే తండ్రికి ఫోన్ చేసి చెప్పాడు. వారంతా ఆస్పత్రికి చేరుకున్నారు. అక్కడికి వచ్చేసరికి నరేష్ కనిపించలేదు. చాలాసేపు అతని కోసం చూశారు. ఎంతకీ రాకపోవడంతో తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత పోలీసులు నరేష్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా అతడు చివరిగా ఎక్కడ ఉన్నాడో గుర్తించారు. బొంరాస్ పేట చెరువు వద్ద ఆఖరిసారి అతని లొకేషన్ చూపించింది.
ఇదీ చదవండి: కన్న కూతురిని కిరాతకంగా హత్య చేసిన కసాయి తల్లి
అక్కడ వెతకగా అతడి వాహనం, వేసుకున్న బట్టలు కనిపించాయి. చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు. చీకటి పడటంతో ఆపేసి వెళ్లిపోయారు. ఆదివారం ఉదయం అతడి శవం చెరువుపై తేలుతూ కనిపించింది. శనివారం సాయంత్రం లక్ష్మి అంత్యక్రియలు నిర్వహించారు. ఆదివారం సాయంత్రం నరేష్ అంత్యక్రియలు నిర్వహించారు. ఒకరోజు వ్యవధిలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మరణించడంతో ఆ గ్రామంలో విషాధఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లైవ్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.