ఈ మద్య చాలా మంది చిన్న చిన్న విషయాలకు మనస్థాపం చెంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా ప్రేమ వ్యవహారం, అప్పుల బాధలు, భార్యాభర్త గొడవలు ఇలా ఎన్నో విషయాల్లో మానసికంగా కృంగిపోయి ఆత్మహత్య చేసుకొని నూరేళ్ల నిండు జీవితాన్ని కోల్పోతున్నారు. తాజాగా విజయనగరంలో విషాదం చోటు చేసుకుంది. ఏఆర్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న అహ్మద్ బాషా విజయనగరం జిల్లా గోకపేట చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న వెంటనే గోకపేట చెరువులో మృత దేహం కోసం గాలింపు చర్యలు చేపట్టి వెలికి తీశారు.
అప్పుల బాధతో గత కొంత కాలంగా అహ్మద్ బాషా మానసిక క్షోభ అనుభివిస్తున్నట్టు సమాచారం. తాను అప్పుల బాధ తట్టుకోలేక చనిపోతున్నా అంటూ చివరిగా తన తండ్రికి ఫోన్ చేసి ఈ అఘాయిత్యానికి పూనుకున్నాడు అహ్మద్ బాషా. ఉద్యోగం చేస్తూ మంచి ఉన్నత స్థాయికి చేరుకుంటాడని అనుకుంటే.. ఇలా అర్థాంతరంగా చనిపోవడం తో కుటుంబ సభ్యుల కన్నీరుమున్నీరు అవుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు