ఆ తల్లిదండ్రులకు 19 ఏళ్ల వయసున్న కూతురు ఉంది. కాలేజి చదువుతున్న ఆ యువతి ఓ రోజు పొలంలో శవమై స్థానికులకు కనిపించింది. దీంతో ఆ యువతి తల్లిదండ్రులు తీవ్ర వేదనకు గురయ్యారు. తమ కూతురిపై అత్యాచారం చేసి హత్య చేశారని వారు ఆరోపించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. యువతిపై అత్యాచారం జరగలేదని రిపోర్ట్ వచ్చింది. అయితే టెక్నాలజీతో పోలీసులు అసలు కథేంటో తేల్చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే… ఉత్తరప్రదేశ్ లోని హర్దోయ్ ప్రాంతానికి చెందిన కమల, నరేంద్ర దంపతులకు 19 ఏళ్ల ప్రతిభ అనే కూతురు ఉంది. ఆమె స్థానిక కాలేజిలో చదువుకుంటోంది. ఈ క్రమంలో కాలేజిలోని ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడి.. అది కాస్తా ప్రేమగా మారింది. ఇద్దరు నిత్యం ఫోన్ మాట్లాడుకున్నేవారు. ఓ రోజు ప్రతిభ ఫోన్లో మాట్లాడుతుండగా చూసిన తల్లిదండ్రులు.. ఆమెను హెచ్చరించారు. అయినా ప్రతిభ వారి మాటాలు పెడచెవిన పెట్టి.. తన ప్రియుడితో ఫోన్ సంభాషణలు కొనసాగించింది.
ఈ క్రమంలో అనుకోకుండా ఓ రోజు పొలంలో ప్రతిభ శవమై కనిపించించింది. తమ కుతురిని ఎవరో అత్యాచారం చేసి హత్య చేశారని యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టంకి తరలించారు. యువతిపై అత్యాచారం జరగలేదని రిపోర్ట్ వచ్చింది. అయితే ఘటనా స్థలంలో దొరికిన కీ ప్యాడ్ ఫోన్ ఐఎంఈఐ నెంబర్ ఆధారంగా అసలు కథ తేల్చారు పోలీసులు.
పోలీసులు తెలిపిన ప్రకారం.. ఆ యువతి తల్లిదండ్రులైన కమల, నరేంద్రలు కూతురు వల్ల తమ పరువు పోతుందేమోనని భయంతో ఈ నెల 22న ప్రతిభ గొంతు కోసి హత్య చేశారు. ఆమె ముఖం, మెడపై దాడి చేయడం వల్ల ఎముకలు విరిగిపోయి ఆ యువతి మృతి చెందింది. హత్య అనంతరం కమల తనతో సన్నిహితంగా ఉండే విపిన్, రాంనరేష్ ల సహాయంతో మృతదేహాన్ని పొలంలో పడేయించింది. ఆ సమయంలో విపిన్ ఫోన్ పొలంలో పడిపోయింది. దీని ఆధారంగానే పోలీసులు మిస్టరీని ఛేదించారు. ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.