ప్రేమ అనే బంధం ఇద్దరి హృదయాలను ఒకటి చేస్తుంది. రెండు కుటుంబాలను ఒకటి చేస్తుంది. కొన్నిసార్లు అదే ప్రేమ కన్న తల్లిదండ్రులకు కడుపుకోత మిగిలుస్తుంది. తాజాగా ఓ ప్రేమోన్మాది చేసిన పనికి ఓ యువతి ప్రాణం పోయింది. తల్లిదండ్రులు చూపించిన సంబంధం చేసుకునేందుకు సిద్ధమైన ఓ అమ్మాయిని ప్రేమించిన యువకుడు అతి కిరాతకంగా హత్య చేశాడు. చివరిసారి ఒకసారి కలిసి మాట్లాడు.. నేను ఇచ్చే గిఫ్ట్ తీసుకో అంటూ నమ్మబలికాడు. వచ్చిన తర్వాత స్నేహితులతో కలిసి ఆమెను అతి క్రూరంగా హత్య చేశాడు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం చిత్రకూట్ జిల్లా హత్వా గ్రామానికి చెందిన రమేశ్- రాధా(పేర్లు మార్చాం) గతేడాది నుంచి వారిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఇద్దరూ ప్రేమించుకున్నారు.. పెళ్లి కూడా చేసుకోవాలని కలలు కన్నారు. ఇంట్లో తల్లిదండ్రులు రాధాకు పెళ్లి సంబంధాలు చూడటం మొదలు పెట్టారు. ఆ విషయం రమేశ్ కు తెలిసి.. ఆమెను నిలదీశాడు. ఇకపై తన తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టాలని అనుకోవట్లేదని అతనికి చెప్పింది. ప్రేయసి మాటలతో రమేశ్ కు కోపం వచ్చేసింది. అలా ఎలా చేస్తావంటూ నిలదీశాడు.
ఒక్కసారిగా రమేశ్ ప్రవర్తనలో మార్పు చూసి రాధా కంగారు పడింది. అతని మాటతీరు, ప్రవర్తన చూశాక ఇంక అతనితో తనకి సెట్ కాదు అనుకుంది. రమేశ్ కు బ్రేకప్ చెప్పేసింది. ఇంట్లో చూపించిన సంబంధం చేసుకోవాలని నిర్ణయించుకుంది. రాధా తనను వద్దనుకోవడంతో రమేశ్ కు కోపం కట్టలు తెంచుకుంది. ఆమెకు బుద్ధి చెప్పాలి అనుకున్నాడు. మార్చి1న ఆమెకు ఫోన్ చేసి కలిసేందుకు ఒక ప్రదేశానికి రమ్మన్నాడు. అందుకు ఆమె నిరాకరించింది. చివరిసారి కలిసి మాట్లాడు.. నీ కోసం ఒక గిఫ్ట్ తీసుకున్నాను అని నమ్మించాడు. సరే చివరిసారి కలిసి మాట్లాడి ఇంక ఎండ్ చేసేద్దాం అనుకుంది. అలాగే రమేశ్ చెప్పిన ప్రదేశానికి వెళ్లింది రాధా.
ఇదీ చదవండి: వీడియో: భార్యను వివస్త్రను చేసి దారుణంగా కొట్టిన భర్త.. కారణం?
రాధా రాగానే రమేశ్ ఆమెతో మళ్లీ పెళ్లి ప్రస్తావన చేశాడు. ఇంట్లో వాళ్లు ఒప్పుకోకపోతేనేం.. పారిపోయి పెళ్లి చేసుకుందాం అన్నాడు. అందుకు రాధా ఒప్పుకోలేదు. తన తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టే పని తాను చేయనని చెప్పేసింది. రమేశ్ ఒక్కడే రాలేదు.. తనతోపాటు ఇద్దరు సన్నేహితులను తీసుకొచ్చాడు. వారు ముందే తెచ్చుకున్న కత్తితో రాధా గొంతు కోశాడు. ఆమె తలను, మొండాన్ని వేరు చేశాడు. అత్యంత క్రూరంగా, పైశాచికంగా హత్య చేసిన రమేశ్ అక్కడి నుంచి పారిపోయాడు.
మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు రాధా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతురాలి తల్లిదండ్రులు రమేశ్ పై అనుమానం వ్యక్తం చేయడంతో.. అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. రమేశ్ నేరం అంగీకరించడంతో.. అరెస్టు చేశారు. అతనికి సహాయం చేసిన మిత్రులను కూడా అదుపులోకి తీసుకున్నారు. రమేశ్ సహా మిత్రులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.