ఈ మధ్యకాలంలో కొందరు యువత మంచిని మెదడుకి ఎక్కించుకోరు. తెలిసీ తెలియని వయసులో కలిగే ఆకర్షణను ప్రేమ అనుకుంటారు నేటి కాలం యువత. కానీ వారికి గురించి తెలిసిన పెద్దలు వాటిని వ్యతిరేకిస్తారు. కొందరు పెద్దలు ఒప్పుకున్నా కొన్ని కండీషన్లు పెడతారు. అర్థం చేసుకున్న యువత కొందరైతే. మరి కొందరు యువతు ఆ మంచి మాటలు ఇష్టం లేక దారుణాలకు పాల్పడుతుంటారు. తాజాగా ఓ యువతి యువకుడు కొన్నేళ్లుగా ప్రేమించుకున్నారు. తెలిసీ తెలియని వయసులో కలిగిన ఆకర్షణను అర్థం చేసుకున్న ఆ పెద్దలు.. ముందు వాళ్లకు బాధ్యతలు తెలియ చేద్దామనుకున్నారు. కొన్నాళ్లు ఆగాలంటూ ఇద్దరికీ సర్దిచెప్పారు. అమ్మాయి అర్థం చేసుకుంది. కానీ, ఆ అబ్బాయే మూర్ఖంగా ఆలోచించి.. ఆ యువతిని కత్తితో గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటు చేసుకుంది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ లోని బాగ్ పట్ ప్రాంతానికి చెందిన దీపా సింగ్(20), రింకూ స్కూల్ డేస్ నుంచి మంచి స్నేహితులు. వీరి బాల్య స్నేహం కాస్తా కొన్నాళ్లకు ప్రేమగా మారింది. ప్రస్తుతం వారిద్దరు డిగ్రీ చదువుతున్నారు. ఒకరిని ఒకరు బాగా ఇష్టపడ్డారు. బుధవారం వీరి పేళ్లి విషయం మాట్లాడేందు కొందరు పెద్దలను తీసుకుని రింకూ.. దీప ఇంటికి వెళ్లాడు. అయితే దీప వాళ్ల ఇంట్లో వాళ్లు పెళ్లికి అభ్యంతరం చెప్పారు. ఇద్దరిని ముందు చదువులు పూర్తి చేయమని, ఉద్యోగంల్లో స్థిరపడ్డాక తప్పకుండా పెళ్లి చేస్తామని మాటిచ్చారు. దీప అందుకు అంగీకరించింది. అయితే రింకూ మాత్రం అయిష్టంగానే తల ఊపాడు.
ఈ క్రమంలో గురువారం మార్కెట్ కు వెళ్లిన దీపను రింకూ అడ్డగించాడు. మీ ఇంట్లో వాళ్లు విడదీయాలని చూస్తున్నారు. ఇప్పుడే పారిపోయి పెళ్లి చేసుకుందామని బలవంతం చేశాడు. వద్దు వారి ఇష్టప్రకారమే చేసుకుందామని దీపా తెలిపింది. దీంతో ఆమె మాటలు నచ్చని రింకూ..పక్కనే ఉన్న దుకాణంలోని వెళ్లి కత్తి తెచ్చుకున్నాడు. మరోసారి ఆమెను అడ్డగించి కత్తితో అతి కిరాతకంగా గొంతుకోసి, దారుణంగా పొడిచి అక్కడి నుంచి పారిపోయాడు. రక్తపు మడుగులో ఉన్న దీపను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స్ పొందుతూ ఆ యువతి మృతిచెందింది. ఘటన జరిగిన కొన్ని గంటలకు రింకూ.. నేరుగా బాగ్ పట్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపం తెలియజేయండి.