యుద్ధంలో జారిన కత్తిని తీసుకోవచ్చేమో గానీ నోటి నుంచి జారిని మాటలను వెనక్కి తీసుకోలేము. నరం లేని నాలుక మాట మనిషి నాశనానికి కూడా దారితీయచ్చు. అందుకే నోరు హద్దుల్లో ఉంటేనే ముద్దు అని పెద్దలు అంటుంటారు. అచ్చం అలాగే ఓ యువకుడి నోటి దూల.. చివరికి అతడి దారుణ హత్యకు కారణమైంది. ఈ ఘటన చిత్తురూ జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే…
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
ఈ ఏడాది జనవరి 3న తిరుపతి పట్టణం రేణిగుంట రోడ్డులోని ఒక లాడ్జి సమీపంలో బొజ్జ అలియాస్ ప్రసన్నకుమార్ దారుణ హత్యకు గురయ్యాడు. అదే ప్రాంతంలో నివాసముంటున్న సుబ్రహ్మణ్యం, రత్నమ్మ కుమారుడు లక్ష్మీపతి(30) ఆ హత్య తానే చేయించానంటూ మద్యం మత్తులో వాగేవాడు. అంతడితో ఆగకుండా వాణ్ని చంపేస్తా.. వీణ్ని చంపేస్తా అంటూ మాటలు తూలేవాడు. వాస్తవానికి లక్ష్మీపతి వికలాంగుడు. కానీ అందరు తనని చూసి భయపడలానే ఉద్దేశంతో తరచూ ప్రసన్న కుమార్ హత్యోదంతం గురించి వాగుతూ ఉండేవాడు. ఆ మాటలు ప్రసన్న కుమార్ ఆప్త మిత్రుడైన వంశీ నమ్మాడు.
దీంతో తన స్నేహితుడిని చంపిన లక్ష్మీపతిని హతమార్చాలని పథకం వేశాడు. ఈ క్రమంలో ఇంటి వద్ద ఉన్న లక్ష్మీపతిని నమ్మించి చింతలచేను వద్దకు తీసుకెళ్లాడు. తన మిత్రుడు ఎక్కడైతే హత్యగావించబడ్డాడో అదే ప్రాంతంలో లక్ష్మీపతిని వంశీ కత్తితో పొడిచి హత్యచేసి పారిపోయాడు. విషయం తెలుసుకున్న మృతుడి కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని కన్నీరు మున్నీరయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. హత్యకు దారితీసిన కారణాలను తెలుసుకున్నారు.
ఇదీ చదవండి: బిగ్ బాస్ సరయు అరెస్టు.. పోలీసుల అదుపులో బోల్డ్ బ్యూటీ
ఇక్కడ వాస్తవం ఏంటంటే.. ప్రసన్న కుమార్ హత్యతో లక్ష్మీపతికి ఏ మాత్రం సంబంధం లేదని తేలింది. అయితే స్నేహితుడిని చంపాడనే అనుమానంతోనా, లేదా పాత కక్షల కారణంగా వంశీ ఈ హత్య చేశాడా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వారం వ్యవధిలో నగరంలో నాలుగు హత్యలు చోటుచేసుకోవడం.. తాజాగా మరో హత్య చోటుచేసుకోవడంతో నగర ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఏది ఏమైనా.. అబద్ధమో, నిజమో నోటి దురుసు ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఈ ఘటన పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.