ఈ మద్య కొంతమంది చిన్న విషయాలకే మనస్థాపానికి గురి అవుతున్నారు.. క్షణికావేశంలో ఎన్నో దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. కొన్నిసార్లు ఎదుటివారిపై దాడులు చేయడం.. ఆత్మహత్యలు చేసుకోవడం లాంటివి చేస్తున్నారు. అలాంటి నిర్ణయాల వల్ల ఎన్నో కుటుంబాల్లో విషాదాలు నిండుకుంటున్నాయి.
ఈ మద్య చాలా మంది క్షణికావేశంలో ఎన్నో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎదుటివారిపై దాడులు చేయడం.. హత్యలు చేయడం.. తమను తామే శిక్షించుకోవడం లాంటివి చేస్తున్నారు. పని ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు ఇతర కారణాల వల్ల మనస్థాపానికి గురైన వారు క్షణికావేశంలో అనర్ధాలకు పాల్పపడుతున్నారు. ప్రతిరోజూ మద్యం తాగి తనను వేధిస్తున్నాడని సహజీవనం చేస్తున్న ప్రేమికుడిని దారుణంగా హత్యచేసింది ప్రియురాలు. ఈ ఘటన తెనాలిలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
తెనాలి మండలం కఠెవరం కాలువ కట్ట ప్రాంతంలో గద్దె రాము, తన్నీరు ఆమని ఇద్దరూ ఆరేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. భర్త నుంచి విడిపోయిన తర్వాత రాముతో కలిసి జీవిస్తుంది ఆమని. అప్పటికే ఆమనికి ఒక బాబు, కుమార్తె ఉన్నారు. రాము కి మాత్రం వివాహం కాలేదు. రెండేళ్ల క్రితం కఠెవరం కాలువ కట్ట ప్రాంతంలో ఓ ఇల్లు అద్దెకు తీసుకొని జీవిస్తున్నారు. రామూ కూలీ పనులకు వెళ్తుండగా.. ఆమని ఇళ్లలో పని చేస్తుంది. కొంతకాలంగా వీరిద్దరూ తరచూ గొడవ పడుతూ వచ్చేవారు. ఆమని తల్లిదండ్రులు సమీపంలోనే ఉంటున్నారు.. వారు వచ్చి ఇద్దరికీ సర్దిచెప్పేవారు. ఈ మద్య రాము పిన్నీ, కూతుళ్లు ఇంటికి రాగా ఆమని వారిపై గొడవ పడింది. అంతేకాదు వాళ్లు తన ఇంట్లో ఇంటే అందరినీ చంపేస్తానని బెదిరించింది. ఈ క్రమంలోనే ఇద్దరి మద్య గురువారం రాత్రి గొడవ జరిగింది.
రాము, ఆమని మద్య గొడవ పెద్దది కావడంతో క్షణికావేశంలో ఇంట్లో ఉన్న కూరగాయల కత్తితో రాము గొంతు కోసింది. కత్తిదాడిలో తీవ్రంగా గాయపడ్డ రాము అక్కడిక్కడే చనిపోయాడు. అర్థరాత్రి సమయంలో ఆమని పెద్దగా కేకలు వేస్తూ ఇంటి నుంచి బయటకు వచ్చి ముగ్గురు వ్యక్తులు తన ఇంటికి వచ్చి భర్త రాముని హత్య చేసి వెళ్లినట్టు ఏడ్చింది. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు సంఘటన స్థలానికి చేరకొని హత్య జరిగిన తీరు, ఇంట్లో చిందరవందరగా పడి ఉన్న సామాన్లను పరిశీలించి ఇది హత్యే అని నిర్ణయానికి వచ్చారు. అంతేకాదు ఆ సమయంలో ఆ ప్రాంతానికి కొత్త వ్యక్తులు ఎవరూ రాలేదని స్థానికులు చెప్పారు. దాంతో పోలీసులకు ఆమనిపై అనుమానం నిజమైంది.. తమదైన శైలిలో ఆమనిని ప్రశ్నించడంతో అసలు నిజం చెప్పింది. పోలీసులు కత్తి స్వాధీనం చేసుకొని.. మృతదేహాన్ని పోస్ట్ మార్టానికి పంపించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.